Samantha – Naga chaitanya : టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న సమంత – నాగచైతన్య జంట విడిపోయి ఏడాది దాటేసిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరు విరిపోయారు అనే వార్తని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అంతటి ముచ్చటైన జంట వీళ్ళిద్దరిది.ఎప్పటి నుండి ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట 2017 వ సంవత్సరం లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.నాలుగేళ్ల వరకు సంసారం బాగానే సాగింది.ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అనిపించేలా చేసారు.

కానీ చివరికి కొన్ని విబేధాల కారణం గా విడిపోయారు.వీళ్లిద్దరు ఎందుకు విడిపోయారని విషయం పై సోషల్ మీడియా లో ఇది వరకు ఎన్నో కథనాలు వచ్చాయి.వీటిపై అటు నాగ చైతన్య కానీ, సమంత కానీ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు.అయినా కూడా సోషల్ మీడియా లో రూమర్స్ మాత్రం ఆగలేదు.అయితే వీళ్లిద్దరు విడిపోవడానికి అసలు కారణం బయటపడింది.అది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇంతకీ వీళ్లిద్దరు విడిపోవడానికి కారణం ఏమిటంటే విభిన్నమైన మనస్తత్వాలు ఉండడం వల్లే.సమంత కి అన్ని విధాలుగా ఫ్రీడమ్ కావాలి,ఆమె షూటింగ్ లేని సమయం లో విదేశాలకు టూర్స్ వేస్తూ, కాస్త వెస్ట్రన్ కల్చర్ ని ఫాలో అవుతూ చిల్ అవుతుంది.కానీ నాగ చైతన్య మాత్రం అందుకు పూర్తిగా బిన్నం.షూటింగ్ లేని సమయం లో ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదవడం, పాత సినిమాలు చూడడం వంటివి చేస్తూ ఉండేవాడట.వీళ్లిద్దరి మధ్య గొడవలు రావడానికి ప్రధాన కారణాలు ఇవేనట.

చిలికి చిలికి గాలి వాన అయ్యినట్టు, ఈ గొడవలే పెద్దవిగా మారి, విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఫిల్మ్ నగర్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. అంతే కాకుండా బోల్డ్ సన్నివేశాల్లో సమంత నటించడం నాగ చైతన్య కి అసలు ఇష్టం ఉండేది కాదట. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సమంత కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తుంది.ఈ విషయం పై కూడా వీళ్లిద్దరి మధ్య గొడవలు జరిగాయని తెలుస్తుంది.
