దాన్ని ప్రేమించే వాడే మొగుడుగా కావాలి.. శోభితా ధూళిపాళ్ల

- Advertisement -

ప్రముఖ మోడల్, నటి శోభితా ధూళిపాళ్ల గురించి మన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హిందీ, తమిళ్, తెలుగు తదితర భాషల్లో వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ప్రస్తుతం దూసుకెళ్తోంది. తాజాగా ఈ అమ్మడు నైట్ మేనేజర్ 2 అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా శోభితా ధూళిపాళ్ల చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. గూఢాచారి చిత్రంతో 2018లో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ వైజాగ్ బ్యూటీ.. ఆ తరువాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1, 2 చిత్రాలతో అలరించింది. ఈ నేపథ్యంలో ఈ అందాల భామపై చాలానే రూమర్స్ కూడా వెల్లువెత్తాయి. వాటన్నింటిని దాటుకుంటూ కేరియర్ పరంగా దూసుకెళ్తున్న ఈ భామ తాజాగా ఓ ఇంటర్ వ్యూలో తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో అనే విషయంపై స్పందించింది.

శోభితా ధూళిపాళ్ల
శోభితా ధూళిపాళ్ల

‘‘నాకు కాబోయేవాడికి ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఏంటంటే.. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. సింప్లిసిటీ. మంచి మనసు, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. ప్రకృతిని ప్రేమించాలి. ఈ జీవితం చాలా చిన్నదనే విషయాన్ని అతడు అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలి’’ అని ఆమె చెప్పారు. అనంతరం తన వ్యక్తిగత జీవితంపై వస్తోన్న వదంతుల గురించి స్పందిస్తూ.. ‘‘అలాంటి వార్తలు నన్ను ఏమాత్రం బాధించవు. కాకపోతే ప్రేక్షకులు నా వర్క్‌ లైఫ్‌ గురించి మాట్లాడితే సంతోషిస్తాను. ఎందుకంటే.. వైజాగ్‌ నుంచి ఇక్కడివరకూ రావడానికి ఎంతో కష్టపడ్డా. ఎన్నో ఆడిషన్స్‌ తర్వాత మొదటిసారి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆనాటి నుంచి ఇప్పటివరకూ ప్రతిరోజూ శ్రమిస్తూనే ఉన్నాను’’ అని ఆమె తెలిపారు.

మరి అలాంటి వ్యక్తి తన జీవితంలోకి రావాలని కోరుకుంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ వీడియోను వైరల్ చేస్తున్నారు. శోభితా ధూళిపాళ్ల అనగానే మనకు ముందుగా కాంట్రవర్సీ గుర్తుకొస్తుంది. ప్రముఖ హీరో నాగచైతన్యతో తాను రిలేషన్ లో ఉన్నదంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. విదేశాల్లో ఓ హోటల్లో తాము ఇద్దరి కలిసి భోజనం చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్అ వ్వడంతో.. ఆ రూమర్స్ కు బలం చేకూరింది. వీటిపై స్పందించిన హీరో నాగచైతన్య వారి మధ్య అలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఒక హీరోయిన్ జీవితంపై మచ్చ వేయడం మంచిది కాదని కూడా హితువు పలికారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here