Shobha Shetty : శోభా శెట్టి ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు. కార్తీక దీపం సీరియల్ లో మోనిత క్యారెక్టర్లో తన విలనిజం చూపి బుల్లి తెర ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి పాపులారిటీ భారీగా పెంచేసుకుంది. ఈ సీరియల్ ద్వారా దక్కిన క్రేజ్ ను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి క్యాష్ చేసుకుంటుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ లో తన ఆట తీరు, మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటూ.. ఇక్కడ కూడా తన బాసిజాన్ని ప్రదర్శిస్తోంది. బుల్లితెరపై పలు సీరియళ్లలో నటించి ప్రస్తుతం బిగ్ బాస్లో టేస్టీ తేజాతో పులిహోర కలుపుతూ.. తన వంతు ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ గురించి ఒక వార్త ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెరీర్ పట్ల ఎంత బిజీగా ఉన్న తాను మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

గతంలో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో పంచుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ అందులో తనకు పెళ్లి చూపులు కాలేదని తెలిపింది. దాంతో పాటు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. మళ్లీ ఇప్పుడు ఆ వీడియోని తన ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఆమెకు సంబంధించిన పెళ్లి విషయాన్ని వైరల్ గా మారుస్తున్నారు. ఇకపోతే శోభా శెట్టి తల్లి ఆమె కోసం ఒక అబ్బాయిని చూసిందని, తన పుట్టినరోజు నాడే చూస్తానని ఆమెకు చెప్పిందట. అయితే అతడి అభిరుచులు, తన అభిరుచులు మ్యాచ్ కాకపోవడంతో తనకు సెట్ కాలేదని ఆ సంబంధం వదులుకున్నామని తెలిపి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇకపోతే పెళ్లి పీటలు ఎక్కాల్సిన శోభా శెట్టి ఇలా అతడి గురించి ముందే తెలుసుకుని బ్రేకప్ చెప్పినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే కార్తీకదీపం సీరియల్ యశ్వంత్ తో తాను ప్రేమాయణం నడుపుతోందని వార్తలు వచ్చినా వాటిలో నిజం లేదని తేలిపోయింది.
