Bigg Boss Telugu లోకి రీసెంట్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 5 మంది కొత్త కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. వారిలో నాయని పావని గత వారం ఎలిమినేట్ అయ్యింది. ఈమె ఎలిమినేషన్ హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులందరికీ ఎంతో బాధకు గురి చేసింది. అయితే ఈ కొత్త కంటెస్టెంట్స్ లో ఆడియన్స్ కి చాలా చిరాకు కలిగిస్తున్న వ్యక్తి భోలే శవాలీ.
మొదటి రోజు నుండి ఇతను చాలా వింతగా ప్రవర్తించడం, ఆడవాళ్ళతో నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, వాళ్ళు కోపం తెచ్చుకున్న తర్వాత వాళ్ళను ఇంకా రెచ్చిపోయే విధంగా వ్యాఖ్యలు చెయ్యడం, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న సమయం లో మధ్యలో దూరడం,ఒక్కటి ఒక్కటంటే ఒక్క మనిషి లక్షణం కూడా ఇతనిలో కనపడడం లేదు. హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఇతని ఎలిమినేషన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
నిన్న జరిగిన నామినేషన్స్ లో కూడా ఇతన్ని నామినేట్ చేసిన వారిపై చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. నిన్నటి నామినేషన్స్ ఈరోజు కూడా కొనసాగుతున్నాయి, భోలే శవాలీ శోభా శెట్టి తో గొడవలు పెట్టుకున్నాడు. నువ్వు సీరియల్ లోనే కాదు, నిజ జీవితం లో కూడా మోనిత లాగానే వ్యవహరిస్తున్నావు అంటాడు. దీనికి శోభా శెట్టి చాలా ఫైర్ అయిపోయింది. ఆమె ఫైర్ అవుతున్న సమయం లో పెట్రోల్ పోసినట్టుగా భోలే శవాలీ మాటలు ఉన్నాయి.
రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమో లో శోభా శెట్టి వైపు చూస్తూ నువ్వు బాగుండాలి అని వెటకారంగా మాట్లాడుతాడు. అప్పుడు శోభా శెట్టి నేను బాగుంటాను అయ్యా, నువ్వు బాగుండకు సరేనా అని చాలా ఘాటుగా సమాధానం ఇస్తుంది. శోభా శెట్టి తో పాటు గా ప్రియాంక తో కూడా ఇతను గొడవలు పెట్టుకున్నాడు. ఆమె ఇతని పై తూ అని అంటుంది. నేను కూడా ‘తూ’ అనే నీ బ్రతుకు ఏమవుద్ది అంటాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రాత్రి ఎపిసోడ్ లో చూడాలి.