Shivathmika Rajashekar పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..మొదటి సినిమా హిట్ అవ్వకున్న నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి..ముఖ్యంగా శివాత్మిక ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయంటూ విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి..అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోలను, పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా వైట్ డ్రెస్సులో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి..
శివాత్మిక ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అది అలా ఉంటే శివాత్మికకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే..ఈ అమ్మడు తన ఫ్రెండ్స్ తో కలిసి దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తుంది..అయితే ఈ విషయంలో శివాత్మిక స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరితోను వెళ్లిపోలేదని.. తన పేరేంట్స్తోనే దుబాయ్ వచ్చానంటూ ఓ ఫోటోను పంచుకున్నారు. రూమర్స్ అంటే కొంతలో కొంత అయిన నమ్మశక్యంగా ఉండాలంటూ.. ఇలాంటీ రూమర్స్ నమ్మవద్దంటూ ఓ పోస్ట్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది..
ఇకపోతే శివాత్మిక ఒకవైపు మెడిసిన్ చదువుతుండటంతో పెళ్లి విషయం ఇప్పట్లో లేనట్లుగా ఉంది. అయితే హీరో కూతురుగా కాకుండా..సొంతగానే క్రేజ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నట్లుగా ఉంది.ఈమె కూడా తండ్రి బాటలో డాక్టర్ చదువుతూ మరోవైపు యాక్టింగ్ వైపు ఫోకస్ పెడుతోంది..కాగా,రీసెంట్గా తండ్రి శేఖర్ టైటిల్‌తో నటించిన సినిమాలో రియల్ లైఫ్ కూతురు పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం శివాని మరో రెండు సినిమాల్లో చేస్తుంది. ఇందులో ఒక తమిళ సినిమా కూడా ఉంది.. వరుస ఆఫర్లు వస్తున్న కూడా సోషల్ మీడియాలో మాత్రం ఈమె క్రేజ్ ను పెంచుకోవడానికి తెగ కష్టపడుతుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటో తో హాట్ టాపిక్ అవుతుంది.. వైట్ డ్రెస్సులో దేవకన్యల మెరిసిపోతున్న శివాత్మిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి..