Shivaji : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకడు శివాజీ. మొదటి వారం నుండి తనదైన మార్కు ని ఏర్పాటు చేసుకుంటూ సాగిన ఆయన బిగ్ బాస్ జర్నీ గురించి ఎంత మాట్లాడుకున్న అది తక్కువే అవుతుంది. తన మాటకారి తత్త్వం తో ఎవరైనా తనతో వాదించాలంటే భయపడి పోయే రేంజ్ లో శివాజీ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ అందరూ హోస్ట్ నాగార్జున ముందు ఒకలాగా, కంటెస్టెంట్స్ ముందు మరొకలాగా ప్రవర్తిస్తూ వచ్చారు. కానీ శివాజీ మాత్రం కంటెస్టెంట్స్ తో ఎలా ఉన్నాడో, హోస్ట్ తో కూడా అదే విధంగా మాట్లాడుతూ వచ్చారు. తనకి తప్పు అనిపిస్తే నాగార్జున తో కూడా వాదించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది కూడా.
విన్నర్ అవ్వడానికి కావాల్సిన లక్షణాలు మొత్తం శివాజీ లో ఉన్నాయి. కానీ చివరి వారాల్లో ఆయన లేడీస్ మీద చేసిన కొన్ని కామెంట్స్ ఆయనపై విపరీతమైన నెగటివిటీ ని పెంచేలా చేసింది. అంతే కాకుండా అమర్ దీప్ ని చిన్న చూపు చూడడం, ఛాన్స్ దొరికినప్పుడల్లా అమర్ ని వేరే లెవెల్ లో ట్రోల్ చెయ్యడం, కొట్టడం వంటివి శివాజీని విన్నింగ్ అవకాశాల నుండి దూరం చేసింది. టాప్ 1 కంటెస్టెంట్ గా నిలవాల్సిన వాడు, చివరికి టాప్ 3 స్థానం కి పరిమితం అయ్యాడు.
అయితే శివాజీ హౌస్ లో ఉన్న అందరి కంటెస్టెంట్స్ కంటే పాపులర్ సెలబ్రిటీ మరియు రాజకీయ నాయకుడు కూడా. అందుకే ఆయనకీ రెమ్యూనరేషన్ ని కూడా భారీగానే ఇవ్వడానికి ఒప్పుకుంది బిగ్ బాస్ టీం. వాళ్ళ లెక్క ప్రకారం వారానికి 5 లక్షలు, అంటే 15 వారాలకు కలిపి 45 లక్షల రూపాయిలు ఇచ్చారట. ఇది బిగ్ బాస్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువే అని చెప్పొచ్చు.