Shobha Shetty : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో నెగటివిటీ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో శోభా శెట్టి పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈమె అగ్రెస్సివ్ యాటిట్యూడ్ తో హౌస్ లో గొడవ పడని కంటెస్టెంట్ అంటూ ఎవ్వరూ లేరు. ఆమె స్నేహితులతో కూడా పలు సందర్భాలలో గొడవలు పడింది. ఎప్పుడు ఎలిమినేట్ అవుతుంది రా బాబు అని ఆడియన్స్ చేత చిరాకు పడేలా చేసుకున్న కంటెస్టెంట్ ఈమె.
అలా బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకున్న శోభా శెట్టి గత వారం ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమె ఎలిమినేషన్ ని బిగ్ బాస్ లవర్స్ ఒక పండగ లాగ జరుపుకున్నారు. అయితే ఎలిమినేట్ అయ్యే ముందు ఆమె శివాజీ తో పెట్టుకున్న గొడవ ఎంత పెద్ద దుమారం రేపిందో మన అందరం చూసాము.
శివాజీ ఆ గొడవ జరిగిన తర్వాత శోభా శెట్టి పై నోరు జారడం , ఆ తర్వాత అక్కినేని నాగార్జున చేత చివాట్లు తినడం ఇవన్నీ జరిగాయి. అయితే సోషల్ మీడియా లో మాత్రం శివాజీ కంటే ఎక్కువగా శోభా శెట్టి నెగటివిటీ ని ఎదురుకుంది. శోభా శెట్టి బయటకి వచ్చిన తర్వాత శివాజీ ఫ్యాన్స్ నుండి అడుగడుగునా ఆమెకి చేదు అనుభవాలే ఎదురు అవుతున్నాయి.
హౌస్ లో నుండి బయటకి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తున్న సమయం లో ఒక అభిమాని ‘ఎప్పుడో బయటకి రావాల్సిన మనిషివి, ఇప్పుడు వచ్చావు’ అంటూ శోభా శెట్టి ముఖం మీదనే చెప్పేసాడు. అంతే కాదు ఈరోజు జరిగిన ఒక ర్యాలీలో పాల్గొన్న శోభా శెట్టి పై కొంతమంది శివాజీ ఫ్యాన్స్ రాళ్ళ దాడి చేసే ప్రయత్న చెయ్యగా సెక్యూరిటీ అడ్డుకున్నారు. ఇలాంటి సంఘటనలు ముందు ఎన్ని జరుగుతాయో అని బయపడి ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. ఇలా శోభా శెట్టి నెగటివిటీ ని చాలా తీవ్ర స్థాయిలో ఎదురుకుంటుంది.