Big Boss : ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ అవ్వడం తో బిగ్ బాస్ హౌస్ ఎమోషనల్ గా సాగిపోయింది. నేటితో ఫ్యామిలీ వీక్ అయిపోయింది. నిన్నటితో పల్లవి ప్రశాంత్ మరియు రతికా కుటుంబాలు తప్ప అందరూ బిగ్ బాస్ హౌస్ కి వచ్చేసారు. నేడు పల్లవి ప్రశాంత్ తండ్రి హౌస్ లోకి అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఈ వారం కెప్టెన్సీ టాస్కు కూడా నేడు ప్రారంభం అయ్యింది.

ఈ కెప్టెన్సీ టాస్కులో శివాజీ మరియు గౌతమ్ కంటెండర్లుగా నిలిచారు అట. గత వారం వీళ్లిద్దరి మధ్య ఎలాంటి గొడవలు చెలరేగాయో మనమంతా చూసాము. ఇద్దరిది తప్పులు సరిసమానంగా ఉన్నాయి. కాకపోతే శివాజీ తప్పులను నాగార్జున కప్పేస్తున్నాడు, గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నాడు అనేది సోషల్ మీడియా లో బాగా వెళ్ళిపోయింది. దీనివల్ల గౌతమ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.

అయితే ఈరోజు జరిగిన కెప్టెన్సీ టాస్కులో గౌతమ్ మరియు శివాజీ మధ్య గొడవ తారా స్థాయికి చేరిపోయింది అట. ఇద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకునే స్థాయికి వెళ్ళిపోయినట్టు టాక్ వినిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా శివాజీ కి బానిసలుగా మారడమో, లేకపోతే ఆయన మీద నెగటివ్ కామెంట్స్ చెయ్యడానికి బయపడడమో చేసేవారు.

ఆయనకీ సపోర్టు గా అక్కినేని నాగార్జున కూడా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి సమయం లో హౌస్ లో శివాజీ కి ఎదురు మాట్లాడే సాహసం ఎవ్వరూ చేయలేకపోతున్నారు. అమీర్ దీప్ కూడా శివాజీ ని ఈమధ్య టార్గెట్ చెయ్యడం మానేసాడు. కానీ గౌతమ్ మాత్రం శివాజీ చేసే తప్పులను ఎత్తి చూపుతున్నాడు. అలా చూపడం వల్ల శివాజీ అసలు రంగు మెల్లగా బయటపడుతుంది. ఈరోజు తో శివాజీ పూర్తిగా మాస్క్ తీసేశాడని అని టాక్.
