అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని పెళ్లి.. పీటల వరకు వెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. తన బ్రదర్ నాగచైతన్య కంటే ముందే అఖిల్ పెళ్లికి సిద్ధమయ్యాడు. జీవీకే వాళ్ల అమ్మాయితో గ్రాండ్‌గా నిశ్చితార్థ వేడుకను కూడా ముగించారు. కానీ ఏం జరిగిందో ఏమో.. అఖిల్ పెళ్లి ఆగిపోయింది. అఖిల్‌తో నిశ్చితార్థం అయిన శ్రియా భూపాల్ ఆ తర్వాత వేరే అతనిని మ్యారేజ్ చేసుకుంది. ఇప్పుడు ఇదే దారిలో శర్వానంద్ పెళ్లి కథ కూడా నడుస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజనే నడుస్తోంది. అయినా కూడా శర్వా సైడ్ నుంచిగానీ, రక్షిత రెడ్డి సైడ్ నుంచి కానీ సౌండ్ లేదు. దీంతో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై శర్వాగానీ, రక్షిత రెడ్డి ఫ్యామిలీగానీ ఎవరూ స్పందించడం లేదు. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఈ పెళ్లి ఆలస్యానికి కారణం.. శర్వానంద్ ఆరోగ్యం అని కూడా ఒక మాట బయటికి వచ్చింది. అతనికి ప్రస్తుతం హెల్త్ బాగోలేదని.. పూర్తిగా రికవరీ అయిన తర్వాతనే పెళ్లి జరుపుదామని.. పెద్దలే ఈ పెళ్లిని వాయిదా వేసినట్లుగా టాక్ వినిపిస్తుంది.
శర్వానంద్ నిశ్చితార్థం జరిగి దాదాపు నాలుగు నెలలు కావొస్తోంది. జనవరి 26వ తేదీన తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో శర్వా నిశ్చితార్థం జరిగింది. రక్షిత రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ మాములు బ్యాక్‌గ్రౌండ్ కాదు. చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తిలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి రక్షిత రెడ్డి మనవరాలు అవుతుంది. దీంతో శర్వా పెళ్లి గురించి వార్తలు హై రేంజ్‌లో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ హీరో పెళ్లి కూడా అఖిల్ పెళ్లిలానే నిశ్చితార్థంతోనే ముగుస్తుందా? అనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ మొదలైంది.