ఆ డైరెక్టర్ పేరు నా దగ్గర ఏత్తకండి.. అతనొక పనికిమాలినోడు అంటూ నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

- Advertisement -

అక్కినేని ఫ్యాన్స్ మొత్తం ఇప్పుడిప్పుడే ‘ఏజెంట్’ చిత్రం చేసిన గాయం నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే క్రమం లో అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.వరుస ఫ్లాప్స్ తో ఇండస్ట్రీ లో బాగా వెనుకబడ్డ అక్కినేని ఫ్యామిలీ,ఈ చిత్రం తో బౌన్స్ బ్యాక్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

నాగ చైతన్య
నాగ చైతన్య

తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అరవింద్ గో స్వామి విలన్ గా నటించగా, కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.శరత్ కుమార్, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమా విడుదల సందర్భంగా నాగచైతన్య వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, రీసెంట్ గా ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన చాలా బోల్డ్ గా ప్రతీ ప్రశ్నకి సమాధానం చెప్పాడు.

Naga Chaitanya

ఈ ఇంటర్వ్యూ ద్వారా నాగచైతన్య లో ఇలాంటి కోణం కూడా ఉందా అని ఆశ్చర్యపోయేలా చేసింది.విలేఖరి ప్రముఖ దర్శకుడు పరశురామ్ గురించి అడుగుతుండగా నాగ చైతన్య దానికి సమాధానం చెప్తూ ‘ఆ డైరెక్టర్ గురించి మాట్లాడి నా సమయాన్ని వృధా చెయ్యదల్చుకోలేదు.అతను ఒక పనికిమాలిన డైరెక్టర్,నా విలువైన సమయాన్ని వేస్ట్ చేసాడు, ఈ టాపిక్ గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.ఎప్పుడూ ఎంతో కూల్ గా ఉండే నాగచైతన్య కి ఇంత కోపం తెప్పించాడంటే,పరశురామ్ ఎలాంటి పనులు చేసి ఉంటాడో ఊహించుకోవచ్చు.

- Advertisement -
#NC20

‘సర్కారు వారి పాట’ సినిమా పూర్తయిన వెంటనే పరశురామ్ నాగ చైతన్య తో సినిమా చెయ్యాలి, ఈ ప్రాజెక్ట్ కోసం నాగచైతన్య తాను ఒప్పుకున్న రెండు సినిమాలను పక్కకి నెట్టిమరీ పరశురామ్ కి డేట్స్ ఇచ్చాడు.కానీ అతను నాగ చైతన్య కి ఎలాంటి సమాచారం అందించకుండా నేరుగా విజయ్ దేవరకొండ తో సినిమా చెయ్యడానికి సిద్ధం అయ్యాడు, ఇది నాగ చైతన్య కి చాలా చిరాకు కలిగించిందట. పరశురామ్ మీద కేవలం నాగ చైతన్య మాత్రమే కాదు, గతం లో మహేష్ బాబు,అల్లు అరవింద్ వంటి వాళ్ళు కూడా ఆయనపై ఇలాంటి అసహనాన్ని వ్యక్తం చేసారు,దీనిని బట్టీ చూస్తే ఆ డైరెక్టర్ ఎలాంటి వాడో అర్థం అవుతుంది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here