Shanmukh Jaswanth : షన్ను ఇలాంటి వాడా.. నమ్మలేకపోతున్నా..

- Advertisement -

Shanmukh Jaswanth : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి వినియోగిస్తుండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ వైజాగ్ కుర్రాడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ పాపులర్ అయ్యాడు. వైవా, వరల్డ్ ఫేమస్ హోస్టెండ్, వరల్డ్ ఫేమస్ వైవ్స్, ఫోటో షూట్, టీమ్ మేనేజర్, కర్మ వంటి షార్ట్ ఫిల్మ్‌లతో తన నటనతో ప్రేకకులకు మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సార్ట్ ఫల్మ్ మహిమ అతన్ని ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చేసింది. అంతేకాదండోయ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ లో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఇందులో కథానాయిక నటించగా… ప్రతి లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి ఈ సిరీస్‌తో కనెక్ట్ అయ్యాడు. షణ్ను తన అమాయకమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్ సిరీస్ అతన్ని అందరికి దగ్గర చేసింది.

Shanmukh Jaswanth
Shanmukh Jaswanth

ఇదంతా షన్నుని స్టార్ గా మార్చడంతో బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ 5లోకి ప్రవేశించి షన్ను రన్నర్‌గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ ఓటీటీ సినిమాతో పాటు స్టూడెంట్ అనే వెబ్ సిరీస్ చేశాడు. మొన్న వైవా హర్ష కీలక పాత్రలో నటించిన సుందరం మాస్టారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసిన షణ్ను ఇప్పుడు గంజాయి కేసులో పోలీసులకు చిక్కాడు. పోలీసులకు ఎలాంటి సమాచారం లేకపోయినా.. అన్నకోసం వెతికే తమ్ముడు దొరికిపోయాడు. దీంతో పోలీసులే షాక్ లో ఉండిపోయేంత పని చేశాడు షన్ము బాబు.. పాపం తప్పు చేసింది అన్న అయితే దొరికింది తమ్ముడు అన్నమాట.. అది కూడా మామూలు కేసు కాదండో ఏకంగా గంజాయితో దొరికిపోయాడు షన్ను సార్.. దీంతో పోలీసులు షణ్ముఖ ను అదుపులో తీసుకున్నారు.

ఇంతకీ ఏం జరిగింది..

- Advertisement -

సంపత్ వినయ్ కు మూడేళ్ల క్రితం వైజాగ్‌కు చెందిన యువతి డాక్టర్ మోనికతో నిశ్చితార్థం జరిగింది. యువతి వైద్యురాలు. ఆమె తల్లి క్యాన్సర్ బారిన పడింది. తల్లి చికిత్స పొందుతుండగా యువతి పెళ్లిని వాయిదా వేసుకుంది. అయితే తాజాగా మళ్లీ ముహూర్తం ఫిక్స్ అయింది.. మరో ఆరు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలో సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. నిశ్చితార్థం జరిగి.. ఆరు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన సంపత్ వినయ్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని తమ్ముడు షణ్ముక్ ఫ్లాట్‌లో అన్న సంపత్ వినయ్‌ ఉంటున్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు.

ఈకేసు విషయమై సంపత్ ఫ్లాట్‌కు వెళ్లగా.. పోలీసులే షాక్ తిన్నారు. ఊహించని రీతిలో షన్ను సార్ పోలీసులకు కనిపించాడు. షణ్ముఖ్ అక్కడ గంజాయి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులకు చూసిన షన్ను, అతడి సోదరుడు షాక్ అయ్యారు. అయితే వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు కేసులు నమోదు చేశారు. అయితే.. షన్ను గతంలో కూడా హిట్ అండ్ రన్ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే.. కాగా.. ప్రస్తుతం వీరి అరెస్టుతో ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగంపై మరోసారి చర్చకు దారి తీసినట్లయ్యింది. అయితే షన్ను ను ఈవిధంగా చూసిన వారందరూ.. షాక్ లో వున్నారు. దీప్తి పాప, షన్నుని వదిలేసి మంచి పని చేసింది. లేదంటే తనుకూడా ఇలాగే తయారయ్యేదని కామెంట్లు చేస్తున్నారు. అయితే.. చూసేందుకు చాలా అమాయకంగా కనిపించే షన్ను ఇలాంటి వాడా? నిజంగా నమ్మలేకపోతున్నామంటూ మరికొందరు ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here