అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ నాగార్జున ఎంట్రీ ఇస్తూ అదరగొట్టారు ఈ సారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో గేమ్ రూల్స్ అంతగా చేంజ్ చేయడం జరిగింది… దీనితో ఈ సరికొత్త సీజన్ ఎలా ఉండబోతోందో అని బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ఉల్టా పుల్టా అంటూ షో పై బుల్లి తెర ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి వరుసగా కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా శృంగార తార షకీలా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వచ్చారు..మలయాళీ చిత్రాలతో షకీలా ఎంతగానో పాపులర్ అయ్యారు..శృంగార భరిత సినిమాలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించారు షకీలా. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తన కొత్త జర్నీని స్టార్ట్ చేసారు షకీలా. బిగ్ బాస్ హౌస్ లో తన ఎంట్రీ ముందు లైఫ్ జర్నీ గురించి వివరించింది షకీలా. నా పేరు సి షకీలా జాన్. మా అమ్మది నెల్లూరు మా నాన్నది చెన్నై. నేను 10 వ తరగతి ఫెయిల్ అయ్యాను.

దీనితో నన్ను నాన్న బాగా కొట్టేవారు. మాకు తెలిసిన మేకప్ మ్యాన్ నన్ను సినిమాల్లోకి రమ్మని ఆహ్వానించారు. దీనితో ఏవిఎం స్టూడియో కి వెళితే సిల్క్ స్మిత సిస్టర్ గా నన్ను ఒకే చేశారు.అక్కడికి వెళ్లిన తర్వాత బట్టలు విప్పేయమనడం లాంటి సంఘటనలు నాకు ఎదురయ్యాయి. ఈ విషయం నాన్నకి చెబితే చేయనని చెప్పు అంటూ ఎంతో ఈజీగా అనేశారు. నేను వాళ్ళకి కేవలం బంగారు గుడ్డు పెట్టే బాతు మాత్రమే అంటూ తన కుటుంబం గురించి చెబుతూ షకీలా ఎమోషనల్ అయింది.