బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లగానే షకీలా ‘బిగ్ బాస్’ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తనతోపాటు హౌస్‌లో ఉన్నసభ్యుల మనస్తత్వాల గురించి చెప్పారు. ‘‘మీరు ఆశ్రమానికి వెళ్లానని అనుకుంటున్నారా? బిగ్ బాస్ హౌజ్‌కు వెళ్లానని అనుకుంటున్నారా?’’ అంటూ గీతూ అడిగిన ప్రశ్నకు షకీలా సీరియస్ అయ్యింది. ‘‘శివాజీ బ్యాచా? సీరియల్ బ్యాచా’’ అన్న ప్రశ్నకు కూడా సీరియస్ అయ్యింది.

‘‘షకీలా హౌజ్‌లో రియల్‌గా ఉన్నారా? ఫేక్‌గా ఉన్నారా’’ అని అడగగా.. తానేం ప్లాన్ చేయలేదని చెప్పింది. ‘‘అసలు బిగ్ బాస్ హౌజ్‌కు ఎందుకు వచ్చారు’’ అంటే.. ‘‘వారు పిలిచారు, నేను వచ్చాను’’ అంటూ సూటిగా సమాధానమిచ్చింది. ఆ తర్వాత హౌజ్‌లో ఉన్న ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయం బయటపెట్టింది షకీలా. శోభా శెట్టి.. హౌజ్‌లో ఒక మాస్క్‌తో ఉందని చెప్పింది. అమర్‌దీప్.. ఏదైనా చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేడు అంటూ కామెంట్ చేసింది. ప్రిన్స్ యావర్‌ను వెధవ అని, బాడీ పెట్టుకొని ఎక్కడికో వెళ్లిపోతాను అనుకోవడం కరెక్ట్ కాదంటూ సూటిగా తన అభిప్రాయాన్ని చెప్పేసింది.

పల్లవి ప్రశాంత్ యాటిట్యూడ్‌ను తప్పుబట్టింది. పాపులారిటీ అనే డ్రగ్‌కు తన అలవాటు పడ్డాడని చెప్పింది. సందీప్ మాత్రమే అక్కడ ఉండాల్సిన అర్హుడు అని స్టేట్మెంట్ ఇచ్చింది. శివాజీని తన సొంత అన్నలాగా భావిస్తున్నాను అని చెప్పింది షకీలా. రతికను పాముతో పోల్చింది. తను కళ్లలో కళ్లు పెట్టి ఎవరినీ చూడదని, అలా చూస్తే దొరికిపోతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. షకీలాను సేఫ్ గేమ్ అని గీతూ కామెంట్ చేయగా.. ‘‘నేను చస్తే వీరంతా రావాలి’’ అంటూ చివరిగా స్టేట్‌మెంట్ ఇచ్చింది షకీలా.