Shakeela : శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఆమె నటించిన సినిమాలు.. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. ఆమె బయోపిక్ కూడా అభిమానుల ముందుకు కూడా వచ్చేసింది. ఇక ఆమె జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే.. కానీ, అందులో కూడా చాలా రహస్యాలు ఉన్నాయి. షకీలా తన జీవితంలో దాగిన కొన్ని విషయాలను నిత్యం ఏదో ఒక సందర్భంలో బయటపెడుతూనే ఉంటుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వచ్చిన షకీలా హౌస్ లో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. ఇక హోస్ నుంచి బయటకు వచ్చాక షకీలా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటుంది. సినిమా అవకాశాల కోసం వెళ్తే ఎంతోమంది తనను కమిట్ మెంట్ అడిగారని ఆమె నిర్మొహమాటంగా చెప్పుకొస్తూనే ఉంది.

షకీలా 90లలో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. తన సినిమా వచ్చిందంటే మలయాళ ఇండస్ట్రీ స్టార్ హీరోల మూవీస్ కూడా వాయిదా వేసుకునే వారు. అంటే ఏ రేంజ్ లో ఆమెకు క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో స్టార్ హీరోలు ఆమెను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టే వారట. చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయట.. అయితే షకీలా స్క్రీన్ పై అందాల ఆరబోతతో ఎంతో మందికి ఆనందాన్ని పంచినా.. ఆమె లైఫ్ మాత్రం చీకటిమయమే అంటూ తాజాగా చెప్పుకొచ్చింది.
తను అలాంటి సినిమాలు చేయనని చెప్పినా సరే అమ్మ, అక్క బలవంతంగా ఆ ఇండస్ట్రీలోకి నెట్టేశారంటూ చెప్పింది. చిన్నప్పుడే ఇలాంటి పనులు చేయించి డబ్బులన్నీ వాళ్లు తీసుకుని ఎంజాయ్ చేసే వారని.. తనకు లైఫ్ లేకుండా అయిపోయిందని వెక్కి వెక్కి ఏడ్చింది. తన అక్క తను సంపాదించిన డబ్బులు తీసుకుని కోటీశ్వరురాలు అయిపోయిందని.. ఇలాంటి తోబుట్టువులు ఎవరికీ ఉండొద్దని ఏడ్చింది. ఆ టైంలో ట్రాన్స్ జెండర్స్ ను పెంచుకున్న తనకు వాళ్లే పిల్లలు అయిపోయారని.. నేను చనిపోతే కొరివి పెట్టేది వాళ్లే అంటూ ఎమోషనల్ అయింది. కాగా షకీలా తెలుగు బిగ్ బాస్ షోకి వచ్చి వెళ్లిన తర్వాత బిజీ అయిపోయినట్లు తెలిపింది. తమిళ్ లో ఓ షోకు యాంకర్ గా చేస్తూ.. పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పింది.