బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఆయనకు అభిమానులు ఉన్నారు. చాలాకాలం తర్వాత ఆయన నటించిన ‘పఠాన్’ సినిమా షారుఖ్‌కి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. పఠాన్ సక్సెస్ ఎక్కడలేని జోష్ ఇచ్చింది. ఇదే ఊపులో ‘జవాన్’, ‘డుంకీ’ సినిమాలు చేస్తూ షారుఖ్ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం షారుక్ ఖాన్ తన తదుపరి చిత్రం అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో షారుక్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తోంది. కాగా తాజాగా షారుఖ్ ఓ కార్యక్రమం కోసం దుబాయ్ వెళ్లారు. దుబాయ్‌లో జరిగిన కార్యక్రమానికి మంగళవారం హాజరయ్యారు. అనంతరం అక్కడ అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించి ఫోటోలు దిగారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు ప్రేమతో షారూఖ్‌ను హగ్ చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ సమయంలో ఓ మహిళ షారుఖ్ వద్దకు చేరుకుంది. అనంతరం ‘మిమ్మల్ని ముద్దుపెట్టుకోవచ్చా?’ అని ఆయనను అడిగింది. షారుఖ్ సమాధానం చెప్పేలోపే ఆయన బుగ్గపై బలవంతంగా ముద్దుపెట్టి సంతోషంగా అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయింది.

అయితే, ఆ అభిమాని చేసిన పనితో షారుఖ్ కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో తెగ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆమె ప్రవర్తనను తప్పుబడుతూ విమర్శలు చేస్తుంటే మరికొంతమంది మాత్రం.. ఆమె అదృష్టవంతురాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా, జవాన్ షూటింగ్‌లో భాగంగా ఇటీవల చెన్నై వెళ్లిన షారూఖ్ అక్కడ తన కో స్టార్ నయనతారతో కొద్దిసేపు ముచ్చటించారు. ఆమె ఇంటికి వెళ్లి షూటింగ్‌లో పాల్గొని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో నయన్ షారూఖ్‌కు ముద్దు పెట్టిన విషయం తెలిసిందే. ఆ వీడియో కూడా నెట్టింట తెగ హల్‌చల్ చేసింది. ఇక షారూఖ్ ఇప్పుడు మరోసారి ముద్దు వీడియోతో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారారు. ఆయన క్రేజ్ అలా ఉంది అంటూ నెటిజన్లు ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు.