బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అరవై ఏళ్లకు దగ్గరలో ఉన్న నవయువకుడిలా కుర్ర హీరోలతో సమానంగా వరుస సినిమాలు చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీ ముద్దుగా బాద్షా అని పిలుచుకుంటుంది. షారుఖ్ ఖాన్ కేవలం నార్త్ ఇండియాకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ధాలు గడిచింది.
అయినా ఇప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు ఆయన. ఆ మధ్య చేసిన సినిమాలన్నీ ఫ్లాపులు కావడంతో రేసులో కాస్త వెనుకబడ్డాడు. కానీ పటాన్ సినిమాతో మళ్లీ ఉప్పెనలా దూసుకు వచ్చారు. ఆ సినిమా దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. షారూఖ్ కెరీర్లోనే ఆ సినిమా ఓ రికార్డ్ హిట్. ఆ సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో జవాన్ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీశారు. తమిళ దర్శకుడు అట్లీ తొలిసారి షారూఖ్ ను డైరెక్షన్ చేశారు.సెప్టెంబర్ 7న జవాన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ క్రమంలోనే షారూఖ్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో షారూఖ్ తెలుగులో మాట్లాడుతున్నాడు.గతంలో జీరో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమయంలో షారూఖ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మరో సారి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 2018లో జీరో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఓ మీడిమా సమావేశంలో పాల్గొన్నాడు, ఆ సమయంలోనే హైదరాబాదుకు చెందిన ఓ జర్నలిస్ట్ ఓ ప్రశ్న అడిగారు.
ఆ టైంలో షారూఖ్ హైదరబాదీ స్లాంగ్ లో మాట్లాడారు. తర్వాత జర్నలిస్ట్ బాగున్నారా ? అన్న ప్రశ్నకు బాగున్నాను అని రిప్లై ఇచ్చారు. అలాగే నా పేరు షారూఖ్ అంటూ తెలుగులో సమాధానం ఇచ్చారు. దీంతో సమావేశంలో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. 2018లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం మరో సారి వైరల్ అవుతోంది. షారుఖ్ ఖాన్ తెలుగులో భలే మాట్లాడరంటూ నెటిజన్లు కామెంట్స్ చేసి ప్రశంసిస్తున్నారు.