Salaar 2023లో మొత్తం మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుఖ్. మొదటి రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్ అయ్యి.. మూడో చిత్రం ‘డంకీ’ పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. అప్పుడే తన తరువాతి సినిమాపై క్రేజీ అప్డేట్ బయటపెట్టాడు షారుఖ్. 2023లో ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలతో హిట్ కొట్టిన తర్వాత రాజ్‌కుమార్ హిరానీతో కలిసి ‘డంకీ’ చేశాడు షారుఖ్ ఖాన్. డిసెంబర్ 21న ‘డంకీ’ మూవీ థియేటర్లలో విడుదలయ్యి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న కారణంగా షారుఖ్ పలు ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

అదే క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ బాద్‌షా.. తన తరువాతి సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ‘‘మార్చి, ఏప్రిల్‌లో కొత్త సినిమాను ప్రారంభిస్తాను. నా వయసుకు తగిన సినిమాను చేసే ప్రయత్నంలో ఉన్నాను. అందులో కూడా నేనే హీరోగా నటిస్తాను’’ అని బయటపెట్టాడు షారుఖ్. దీంతో ఫ్యాన్స్‌లో మరింత ఆతృత పెరిగిపోయింది. ప్రస్తుతం మూవీ టీమ్ అంతా ‘డంకీ’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ముంబాయ్‌లోని గెయ్టీ గ్యాలక్సీలో పడిన మార్నింగ్ షోను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. దీన్ని బట్టి చూస్తే విడుదల రోజే.. దాదాపు రూ.30 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందట ‘డంకీ’.

ఇక ‘డంకీ’ విడుదలయిన ఒక్కరోజు గ్యాప్‌లోనే ‘సలార్’ కూడా ప్రేక్షకుల ముందుకు రావడంతో దీని కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. పైగా ‘డంకీ’కి వస్తున్న మిక్స్‌డ్ రివ్యూస్ వల్ల మూవీ లవర్స్.. తమ మొదటి ప్రాధాన్యతను ‘సలార్’కే ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ‘డంకీ’కి పూర్తిగా పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే.. ‘సలార్’ కలెక్షన్స్‌కు గండిపడేది. కానీ అలా జరగలేదు. దీంతో సలార్ దెబ్బకు షారుక్ రూట్ మార్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.