Shah Rukh Khan ను కచ్చితంగా చంపేస్తాం.. స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. వై+భద్రత కేటాయింపు

- Advertisement -


బాలీవుడ్ నటుడు Shah Rukh Khan భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పఠాన్, జవాన్ చిత్రాలు విజయం సాధించిన తర్వాత తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని షారుక్ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో వారికి భద్రత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. షారుక్ భద్రతను వై+గా మార్చారు. షారుఖ్ ఖాన్ లిఖితపూర్వక ఫిర్యాదుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐజి విఐపి భద్రత కలిపించాలని ఆదేశించారు. ఆయనకు ప్రస్తుతం ఉన్న భద్రతను పెంచాలని కోరారు.

shah rukh khan
shah rukh khan

షారుఖ్ ఖాన్ ఈ సెక్యూరిటీ కోసం తానే ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. షారుక్ ఖాన్‌ 2023 సంవత్సరం బాగా కలిసొచ్చింది. కొన్నాళ్లుగా హిట్ లేని షారూఖ్ కు బ్యాక్ టు బ్యాక్ పఠాన్ ఆపై జవాన్ రెండు హిట్స్ పడ్డాయి. అతని రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా రికార్డులను సృష్టించాయి. ఈ రెండు సినిమాల విజయం తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని షారుక్ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

srk

పఠాన్ 25 జనవరి 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 1050 కోట్ల రూపాయలను రాబట్టింది. అతని రెండో సినిమా జవాన్ కూడా పఠాన్ రికార్డును బద్దలు కొట్టింది. సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జవాన్ ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రెండు బ్లాక్‌బస్టర్‌లను అందించిన తర్వాత షారుక్‌కి డుంకీ అనే చిత్రంతో రాబోతున్నారు. డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here