Simran : నిన్నటి తరం హీరోయిన్స్ లో అందం తో పాటుగా అద్భుతమైన నటన కనబర్చే హీరోయిన్స్ లో ఒకరిగా సిమ్రాన్ కి మంచి క్రేజ్ ఉంది.విలక్షణమైన పాత్రలతో ఎప్పుడూ కూడా ప్రేక్షకులను థ్రిల్ కి గురి చెయ్యడం సిమ్రాన్ స్టైల్.తెలుగు మరియు తమిళం బాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సిమ్రాన్ దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించింది.ముఖ్యంగా మన టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కి ఈమె లక్కీ హీరోయిన్.ఆయనతో కలిసి ‘సమరసింహా రెడ్డి’ , ‘నరసింహ నాయుడు’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు చేసింది కానీ మెగాస్టార్ చిరంజీవి తో చేసిన ‘మృగరాజు’ మరియు ‘డాడీ’ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఒక్క చిరంజీవి తో తప్ప బాలకృష్ణ ,నాగార్జున మరియు వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో ఇండస్ట్రీ ని షేక్ చేసిన సూపర్ హిట్స్ సిమ్రాన్ ఖాతాలో ఉన్నాయి.
అయితే వయస్సు పెరిగే కొద్దీ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడం అనేది చాలా సహజం, అలాగే సిమ్రాన్ కి కూడా హీరోయిన్ అవకాశాలు తగ్గిపోవడం తో క్యారక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యింది.ఈమధ్యనే పలు సినిమాల్లో ఈమె విలన్ గా నటించి అందరినీ ఆశ్చర్య పర్చింది.ముఖ్యంగా తమిళ హీరో శివ కార్తికేయన్ హీరో గా నటించిన సీమరాజా సినిమాలో ఆమె పోషించిన నెగటివ్ క్యారక్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం ఆమె తమిళం లో ‘అందగన్’ , ‘ధ్రువ నక్షత్రం’ మరియు ‘వంగణముడి’ వంటి చిత్రాలలో నటిస్తుంది.సినిమాల్లో ఎంత బిజీ అయ్యినప్పటికీ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండడం సిమ్రాన్ కి మొదటి నుండి బాగా అలవాటు.తనకి సంబంధించిన ఫొటోలతో పాటు, తనకి కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎల్లప్పుడూ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ప్రస్తుతం సిమ్రాన్ వయస్సు దాదాపుగా 46 ఏళ్ళు ఉంటుంది..కానీ ఇప్పటికీ కూడా ఈమె నేటి తరం కుర్ర హీరోయిన్స్ తో సమానమైన గ్లామర్ ని మైంటైన్ చేస్తూ ఉంటుంది.ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో చాలా మందికి 35 ఏళ్ళు దాటగానే ముఖం మీద మడతలు పడడం ప్రారంభం అవుతాయి, కానీ సిమ్రాన్ ఈ వయస్సులో కూడా ఇంత అందం ఎలా మైంటైన్ చేస్తుంది అనే సీక్రెట్ ఆమెకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఇది ఇలా ఉండగా సిమ్రాన్ ఆరోజుల్లోనే బికినీ దుస్తులలో ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.అప్పటి ఫోటోలు ఇప్పటికీ సిమ్రాన్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఆమె బికినీ లో ఉన్న కొన్ని ఫోటోలు మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.ఈ ఫొటోలతో పాటుగా ఆమె లేటెస్ట్ ఫోటోలు మరియు వీడియోస్ కూడా చూడొచ్చు.