Actress Kasthuri గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు అడపాదడపా సినిమాలలో కనిపించి ప్రేక్షకులకు గుర్తిండి పోయింది.. ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈమె పలు టీవీ సీరియల్స్ లో కనిపిస్తూ ప్రేక్షకులు అభిమానాన్ని అందుకుంది.తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో నటించారు . ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ ద్వారా కస్తూరి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ సీరియల్ తో Actress Kasthuri బుల్లితెరపై మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఇక కస్తూరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ తో పాటు లు, సీరియల్స్ అప్డేట్స్ కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు…

అంతేకాదు సమాజం లో జరుగుతున్న అన్యాయాల పై కూడా అభిమానులతో పంచుకుంటుంది.. ఆమె స్టైల్లో విరుచుకు పడుతారు..ఇదిలా ఉంటే తాజాగా ఆమె అనారోగ్యానికి గురైందని తెలుస్తోంది. తాను అనారోగ్యం బారిన పడ్డానంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు కస్తూరి. ఆ వ్యాధి తనపై ఎంతగా ప్రభావం చూపిందో చెప్తూ కొన్ని ఫొటోలను షేర్ చేసారు.. అవి కాస్త చర్చనీయాంసంగా మారింది..
కస్తూరి చికెన్ పాక్స్‌తో బాధపడుతున్నారట. ఈ వ్యాధి సోకడంతో తన మొఖం అంతా మారిపోయిందని. ఈ చికెన్ పాక్స్ మచ్చలు ఎలా ఉన్నాయో చూడండి.. అదృష్టం ఏంటంటే అవి నా కళ్లపై వాటి ప్రభావం చూపలేదు. ఎప్పటి లాగే కస్తూరి ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీ ప్రేమ, మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నా. ఎంతోకాలంగా సంరక్షించుకుంటున్నా నా మృదువైన చర్మం ఇప్పుడు మచ్చలు, మొటిమలతో ఇబ్బందిగా మారింది’ అంటూ కస్తూరి తన బాధను సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.. ప్రస్తుతం ఆ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి..