Actress Kalyani : టాలీవుడ్ లో అందాల ఆరబోతతోనే కాదు, హోమ్లీ పాత్రలు కూడా చేస్తూ టాప్ స్థానానికి చేరుకున్న హీరోయిన్లు ఇండస్ట్రీ లో చాలా తక్కువ మంది ఉన్నారు.మహానటి సావిత్రి,సౌందర్య, లయ, స్నేహ ఇలా కొంతమంది ఉన్నారు.వారితో పాటుగా ఇండస్ట్రీ లో హోంలై పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కళ్యాణి.ఈమె హీరోయిన్ గా మారే ముందు మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టు గా నటించింది.

ఆ తర్వాత ‘ఉద్యానపాలకం’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది.అలా మలయాళం లో వరుసగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈమె తెలుగు లో 2002 వ సంవత్సరం లో విడుదలైన ‘శేషు’ అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది.రాజశేఖర్ హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాకపోయినా ఈమెకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.

ఇక ఆ సినిమా తర్వాత ఈమె రవితేజ తో చేసిన ‘అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ అనే సినిమా పెద్ద కమర్షియల్ హిట్ అయ్యింది.అంతే అప్పటి నుండి ఈమెకి టాలీవుడ్ లో కూడా వరుసగా హీరోయిన్ రోల్స్ వచ్చాయి.’పెళ్ళాం తో పనేంటి’ , ‘వసంతం’, ‘కబడ్డీ కబడ్డీ’ , ‘పెద్దబాబు’, ‘లక్ష్యం’ ఇలా ఎన్నో సూపర్ హిట్స్ లో నటించింది.ఈమెకి తెలుగు లో ఎక్కువగా జగపతి బాబు సినిమాల్లోనే హీరోయిన్ గా నటించింది.ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈమె క్యారక్టర్ ఆర్టిస్టు గా బాగా రాణించింది.

‘యాత్ర’ సినిమా వరకు యాక్టీవ్ గా సినిమాల్లో నటించిన ఈమె, ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కాదు, సినిమాల్లో కనిపించకుండా మాయం అయిపోయింది. ఈమె ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ మరియు డైరెక్టర్ సాయి కిరణ్ ని పెళ్ళాడి కొన్నాళ్ల తర్వాత విడిపోయింది.ఆ తర్వాత ఆమె మళ్ళీ ఎలాంటి సినిమాల్లో నటించలేదు. అయితే ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో లీక్ అయ్యి వైరల్ గా మారింది. అంతకు ముందుతో పోలిస్తే లావుగా మారిపోయింది.
