Kota Srinivasa Rao టాలీవుడ్ లో దిగ్గజ నటుడు, నటన ప్రస్తావన వస్తే అతని పేరు తల్చుకోకుండా ఉండలేము,అతని పేరే కొత్త శ్రీనివాస రావు.మహానటుడు ఎస్ వీ రంగారావు లేని లోటుని పూడ్చిన మహానుభావుడు ఆయన.విలన్ గా భయపెడుతూనే కమెడియన్ గా కూడా కడుపుబ్బా నవ్వించడం కొత్త శ్రీనివాస రావు ప్రత్యేకత.అంతే కాదు సెంటిమెంట్ ని పండించడం లో కూడా కొత్త శ్రీనివాస రావు ని మించిన క్యారక్టర్ ఆర్టిస్టు ఎవ్వరూ లేరని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అలాంటి మహానటుడు నేడు చనిపోయాడు అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం అయ్యింది.అయ్యో పాపం అంటూ నెటిజెన్స్ అందరూ ఒక మహానుభావుడిని కోల్పోయాము అంటూ ట్వీట్స్ వెయ్యడం ప్రారంభించారు.అయితే ఇదంతా గమనించిన ఇండస్ట్రీ పెద్దలు కోటా శ్రీనివాస రావు గారి ఇంటికి కాల్ చేసి పరామర్శించడం ప్రారంభించారట.అప్పుడే అసలు విషయం తెలిసింది, కోటా శ్రీనివాస రావు సంపూర్ణ ఆరోగ్యం గానే ఉన్నాడు అని.
ఈ విషయం తెలుసుకున్న కోటా శ్రీనివాస రావు వెంటనే మీడియా కి ఒక వీడియో విడుదల చేసారు, ఆయన మాట్లాడుతూ ‘రేపు ఉగాది , ఎలా చెయ్యాలి ఇంట్లో అని అనుకుంటూ ఉన్నాను, ఈలోపు సోషల్ మీడియా నేను చనిపోయాను అంటూ వార్తలు రావడం చూసి షాక్ కి గురి అయ్యాను.ఈ విషయం నాకు పోలీసుల ద్వారా ముందుగా తెలిసింది, వాళ్ళు పొద్దునే ఒక పది మంది వ్యాన్ వేసుకొని వచ్చారు.ఇలా మీ గురించి న్యూస్ వచ్చింది అండీ, పెద్ద నటులు కదా, జనాలు మిమల్ని చూడడానికి బాగా వస్తారని సెక్యూరిటీ కోసం వచ్చాము అంటూ వచ్చారు.
అప్పుడు నేను ఏంటండీ ఇదీ, మీరు పోలీసులు కదా..!,ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ముందు వెనక చూసుకొని రావాలి,అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాల్సిన మీరే ఇలా మోసపోతే ఎలా అని అన్నాను.నేను నిక్షేపంగానే ఉన్నాను,దయచేసి ఆకతాయిలు చేసే అసత్య ప్రచారాలను నమ్మొద్దు.డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.ఇలా ఒకరి చావు బ్రతుకులను అడ్డం పెట్టుకొని మాత్రం సంపాదించొద్దు’ అంటూ కోటా శ్రీనివాస రావు ఈ సందర్భం గా చెప్పుకొచ్చాడు.