JR NTR : నట వారసత్వం ఉన్న సొంత టాలెంట్ తో కింద స్థాయి నుంచి గ్లోబల్ హీరో రేంజ్ కు ఎదిగిన హీరో ఎన్టీఆర్. తాత సీనియర్ ఎన్టీఆర్ రూపాన్ని పునికి పుచ్చుకుని జన్మించడం ఆయనకు ప్లస్ పాయింట్.. నందమూరి అభిమానులు తనలోనే సీనియర్ ఎన్టీఆర్ ను చూసుకుంటూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా అందరికీ ఇష్టమైన హీరో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. కారణం తెలియదు కానీ అందరు హీరోల ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ ను కామన్ గా లైక్ చేస్తుంటారు. ఎవరో ఫ్యాన్ బేస్ వాడుకుని ఎన్టీఆర్ ను కావాలని అప్పుడు ట్రోల్ చేస్తుంటారు కానీ.. మిగతా హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్టీఆర్ ని ఇష్టపడుతుంటారు.

అల్లు అర్జున్, మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమాలతో పాటు ఎన్టీఆర్ సినిమాలను కూడా సమాంతరంగా ఆదరిస్తారు . ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అభిమాని అయితే తన హీరో పుట్టిన రోజు మ అంటే కేక్ కట్ చేస్తాడు.. లేకపోతే తన స్థోమతకు తగ్గట్టు ఒక పదిమందికి అన్నదానం, వీలైతే రక్తదానం చేస్తారు. అయితే ఇక్కడ ఓ అభిమాని మాత్రం చాలా స్పెషల్ జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన పిచ్చి ఉన్నట్లుంది. దీంతో తన సొంత ఇంటిని కట్టేందుకు వాటే ఇటుకలను ఎన్టీఆర్ పేరుతో డిజైన్ చేయించుకున్నాడు. బట్టి కార్మికులకు చెప్పి ప్రతి ఇటుక పై ఎన్టీఆర్ పేరును ముద్రించుకున్నారు. దీనికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. వీటిని చూసిన నందమూరి ఫ్యాన్స్ ఈ ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు.
