Mahesh Babu పై పోలీస్ కేసు వేసిన శాస్త్రవేత్తలు.. అసలు ఏమైందంటే!

- Advertisement -

Mahesh Babu : మన టాలీవుడ్ లో యాడ్ వరల్డ్ కింగ్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘పోకిరి’ సినిమా తర్వాత ఈయన చేసినన్ని యాడ్స్ టాలీవుడ్ లో ఏ హీరో కూడా చెయ్యలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. దాదాపుగా ప్రతీ బ్రాండ్ కూడా మహేష్ బాబు ఇమేజి ని తెగ వాడేసింది. ఒక్కో యాడ్ కి మహేష్ బాబు దాదాపుగా 7 కోట్ల రూపాయిలు తీసుకుంటాడు.

Mahesh Babu
Mahesh Babu

ఇప్పటికీ కూడా ఆయన యాడ్స్ చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు చేసిన కొన్ని యాడ్స్ పై అటు ఫ్యాన్స్ నుండి, ఇటు పలు సంస్థల నుండి అభ్యంతరాలు కూడా వచ్చాయి. గతంలో ఆయన ఒక ప్రముఖ విస్కీ బ్రాండ్ ని ప్రమోట్ చేసినందుకు అభిమానులు సైతం మండిపడ్డారు. ఇప్పుడు మహేష్ బాబు – సుదీప్ కలిసి చేసిన ‘హెల్త్ ఓకే’ యాడ్ వివాదాల్లో చిక్కుకుంది.

Mahesh Babu Police case

గతం లో వీళ్లిద్దరు కలిసి ‘హెల్త్ ఓకే’ అనే యాడ్ లో నటించారు. ఈ యాడ్ పై రసాయన శాస్త్రవేత్తల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహేష్ పై కోర్టు లో కేసు వేశారు. ఈ యాడ్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలని AIOCD సంస్థ మహేష్ బాబు ని డిమాండ్ చేసింది. ఈ యాడ్ ద్వారా మాంసాహారం తినని ఆరోగ్యం గా ఉన్నట్టు సూచిస్తుంది. ఇది విటమిన్ లోపం ఉన్న శాఖాహారులను తప్పుదోవ పట్టించే ప్రకటన లాగ ఉంది అంటూ వివరించారు.

- Advertisement -

అయినా ఒక సూపర్ స్టార్ హోదాలో ఉన్నప్పుడు ఆచి తూచి ప్రకటనలు చెయ్యాలి. ఇలాంటి ప్రకటనలు చెయ్యడం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. వెంటనే ఈ ప్రకటనని ఉపసంహరించుకోవాలి అంటూ మహేష్ బాబు ని డిమాండ్ చేసారు. మరి దీనికి మహేష్ బాబు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here