Save The Tigers 2 : సేవ్ ద టైగర్స్ రివ్యూ.. అదరగొట్టిన జోర్దార్ సుజాత

- Advertisement -

Save The Tigers 2 : తెలుగు వెబ్ సిరీస్‌లో సూపర్ హిట్ అయిన వాటిలో సేవ్ ది టైగర్స్ ఫస్ట్ ప్లేసులో ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సిరీస్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఓటీటీ ప్రేక్షకులు ఈ సిరీస్‌ను ఆదరించిన తీరు చూసి వెంటనే రెండో సీజన్‌ను తెరకెక్కించారు. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ హీరోలుగా…. ‘జోర్దార్’ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ హీరోయిన్లుగా నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్ 2’. మహి వి రాఘవ్ షో రన్నర్ & క్రియేటర్.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సీరత్ కపూర్, దర్శనా బానిక్ కూడా జతయ్యారు. అరుణ్ కొత్తపల్లి ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ఎలా ఉంది? మొదటి సీజన్ ను మించి నవ్విస్తుందా? చూద్దాం. ‘సేవ్ ద టైగర్స్ 2’ ఫస్ట్ సీజన్ ముగిసిన చోటనుంచే స్టార్ అవుతుంది.

- Advertisement -

కథ : హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్) ఎక్కడని పోలీస్ స్టేషన్‌లో విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి)లను పోలీసులు ప్రశ్నిస్తారు. ఆమె మిస్సింగ్ కేసులో ముగ్గురిని వేలాడ దీసి లాఠీ ట్రీట్ మెంట్ ఇస్తారు. తమకు తెలియదని వాళ్లు మొత్తుకున్నా వినరు. వాళ్లకు స్టార్ హోటల్ నుంచి హంసలేఖను తీసుకువెళ్లిన వీడియో చూపిస్తారు. ఆ ముగ్గురూ కలిసి ఆమెను చంపేశారంటూ న్యూస్ చానల్స్ అన్నీ అనుమానం వ్యక్తం చేస్తాయి.అదంతా అబద్ధమని, తాము కలిసి పార్టీ మాత్రమే చేసుకున్నామని హంసలేఖ డైరెక్టుగా వచ్చి చెప్పడంతో వారిని పోలీసులు వదిలేస్తారు.

పోలీస్ స్టేషన్ నుంచి విక్రమ్, రవి, రాహుల్ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ ముగ్గురి భార్యలు స్పందన (సత్యకృష్ణ) దగ్గరకు ఎందుకు వెళ్లారు? రవికి కార్పొరేటర్ టికెట్ ఇస్తానని ఎమ్మెల్యే ఎందుకు చెప్తాడు? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుకోవాలన్న రవి భార్య హైమావతి (జోర్దార్ సుజాత) కల నెరవేరిందా? లేదా? విక్రమ్ భార్య రేఖ (దేవియాని శర్మ) లాయర్ ప్రాక్టీస్ ఎందుకు ఆపేయాలన్న నిర్ణయం తీసుకుంది ? రాహుల్, అతని భార్య మాధురి (పావని గంగిరెడ్డి) మధ్య హారిక (దర్శనా బానిక్) ఎవరు? మూడు జంటల మధ్య గొడవలకు కారణం ఏమిటి? అనేది మనం సిరీస్ చూస్తే అర్థం అవుతుంది.

విశ్లేషణ : ‘సేవ్ ద టైగర్స్ 2’లో కళ్లతో చూసేదంతా నిజం కాదన్నది చూపించారు. సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్లలో వైరల్ న్యూస్ చూస్తుంటాం.. వాటినే నిజమని నమ్మేస్తాం. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేసే తీరిక చాలామందికి ఉండదు. అసలు నిజం తెలుసుకోకుండా ఓ అభిప్రాయానికి రావడం వల్ల జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళుతున్నాయనేది ఈ సీజన్ లో చక్కగా చెప్పారు. మహి వి రాఘవ్ రచనలో డ్రామా వర్కౌట్ అయింది. ‘సేవ్ ద టైగర్స్’ మరోసారి కామెడీతో సక్సెస్ కొట్టింది.

సేవ్ ద టైగర్స్ 2 లో ఫస్ట్ మూడు ఎపిసోడ్స్ మామూలుగా ఉండవు. నాలుగో ఎపిసోడ్‌లో 10000BC ట్రాక్ నవ్వించలేదు. వివాహ వ్యవస్థ పుట్టుక వెనుక చెప్పిన కథ అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత మళ్లీ కామెడీతో పాటు ఎమోషన్స్ బ్యాలన్స్ చేస్తూ క్లైమాక్స్‌ను అదరగొట్టేశారు. ప్రియదర్శి – సుజాత, చైతన్యకృష్ణ – దేవియాని శర్మ మధ్య సన్నివేశాలు సూపర్బ్ గా పండాయి. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన యాక్టర్ గా మారిన జోర్డార్ సుజాత ఈ రెండు సీజన్లతో అదరగొట్టేసింది. ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చేందుకు ఈ రెండు సీజన్లు గట్టిపునాదులుగా నిలుస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

అజయ్ అరసాడ సంగీతం కథతో పాటు సాగింది. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ… ముగ్గురి నటన బావుంది. అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్.. రాహుల్ పాత్రలో చైతన్యకృష్ణ జీవించారు. దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి సైతం తమ తమ క్యారెక్టర్లలో జీవించారు. హంసలేఖగా సీరత్ కపూర్ చక్కగా రాణించారు. భార్యాభర్తలుగా సత్యకృష్ణ, వేణు ఎల్దండి సన్నివేశాలు నవ్విస్తాయి. గంగవ్వ, ముక్కు అవినాష్ తదితరులు తమ పరిధి మేరకు చేశారు. రోహిణి మరోసారి మాస్ మెయిడ్ క్యారెక్టర్‌లో నవ్వించారు.

కన్ క్లూజన్ : ఓవరాల్ గా ‘సేవ్ ద టైగర్స్ 2’… ఈ సిరీస్ నవ్విస్తుంది.. వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో చెబుతుంది. తండ్రీ కూతుళ్ళ అనుబంధం చూపిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here