టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో బాలీవుడ్ నటి సారా అలీఖాన్ డేటింగ్లో ఉందంటూ ఎంతోకాలం నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ రెస్టారెంట్లో కలుసుకున్న ఫోటోలు వైరల్ కావటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై వారు స్పందించక పోవటంతో రూమర్స్‌గానే మిగిలిపోయాయి. అయితే తాజాగా ఈ వార్తలపై సారా అలీఖాన్ స్పందించారు. క్రికెటర్‌ను పెళ్లి చేసుకోవడంలో తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
విక్కీ కౌశల్‌తో తాను నటించిన సరికొత్త చిత్రం ‘జర హట్ కే జర బచ్ కే’ సినిమా ప్రమోషన్లో భాగంగా సారా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారంటూ విలేకరి ఆమెను అడిగారు. ‘వ్యక్తిగత జీవితంలో మీ నాన్నమ్మ షర్మిలా ఠాకూర్ (ఆమె క్రికెటర్ మన్సూర్‌ను వివాహం చేసుకున్నారు)ను అనుసరిస్తారా?’ అంటూ సారాని యాంకర్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన నటి ‘‘నా మానసిక, ఆధ్యాత్మిక విలువలకు సరితూగే వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అతడు ఏ రంగానికి చెందిన వాడనేది పెద్దగా పట్టించుకోను. క్రికెటర్, నటుడు, వ్యాపారవేత్త.. ఇలా రంగం ఏదైనా పర్వాలేదు. నా విలువలను గౌరవిస్తే చాలు’’ అని బదులిచ్చారు.
ఓ క్రికెటర్‌తో డేటింగ్లో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. ‘‘నా జీవిత భాగస్వామిని నేనింకా కలవలేదు. కలిశానని కూడా అనుకోవడం లేదు. ఇది మాత్రం పూర్తి భరోసాతో చెబుతున్నా’’ అని తెలిపారు.
ఇక శుభ్‌మన్ గిల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. “మీరు సారాతో డేటింగ్లో ఉన్నారా?” అని యాంకర్ ప్రశ్నించగా “అవునేమో..!” అని తెలివిగా సమాధానమిచ్చాడు. దీంతో ప్రేమ పుకార్లకి మరింత బలం చేకూరింది. ఇక్కడ విషయం ఏమిటంటే.. శుభమన్ గిల్ సారా అలీఖాన్‌తో డేటింగ్లో ఉన్నాడని కొందరు, లేదు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో ప్రేమలో ఉన్నాడంటూ మరికొందరు అంటున్నారు. ఇప్పటికీ శుభమన్ ఎవరిని డేట్ చేస్తున్నారనేది క్లారిటీ లేని విషయం.