Sandeep Vanga : ప్రస్తుతం ఇండియా మొత్తం మారుమోగిపోతున్న పేరు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి చిత్రం తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సందీప్, అదే చిత్రాన్ని హిందీ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఆ చిత్రం తో సందీప్ పేరు బాలీవుడ్ లో మోతమోగిపోయింది.
ఈ సినిమా తర్వాత ఆయన చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఎనిమల్’ ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇంత వైల్డ్ టేకింగ్ తో ఇది వరకు ఏ డైరెక్టర్ కూడా సినిమాలు తియ్యలేదు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక సరికొత్త ఒరవడిని సృష్టించాడు సందీప్ వంగ. ఈ సినిమాలో హీరో రణబీర్ కపూర్ కి ఎంత మంచి పేరు వచ్చిందో, హీరోయిన్ రష్మిక కి కూడా అంతే మంచి పేరు వచ్చింది.
అయితే రష్మిక కి అంత మంచి పేరు తీసుకొచ్చిన సందీప్ వంగ, తన మొదటి సినిమా హీరోయిన్ షాలినీ పాండే విషయం మాత్రం చాలా అన్యాయం చేసాడని ఇండస్ట్రీ లో ఒక టాక్ వినిపిస్తుంది. అర్జున్ రెడ్డి చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నప్పుడు, హిందీ లో కూడా షాలినీ పాండే తో చెయ్యాలని ఫిక్స్ అయ్యాడట.
ఆమె డేట్స్ ని కూడా తీసుకున్నాడు, కానీ చివరి నిమిషం లో కియారా అద్వానీ ని తీసుకోవాల్సి వచ్చింది, కారణం ఏంటో ఎవరికీ తెలియదు కానీ తన తదుపరి చిత్రం ‘ఎనిమల్’ లో కచ్చితంగా హీరోయిన్ రోల్ అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడట సందీప్. కానీ చివరికి రష్మిక మందన ని తీసుకున్నాడు.
ఈ రెండు సినిమాలలో ఎదో ఒక చిత్రం లో షాలిని పాండే నటించి ఉంటే ఈరోజు ఆమె కెరీర్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండేది. కానీ ఇప్పుడు ఆమె సినిమాల్లో అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది, ఇది కేవలం సందీప్ వల్లే అని సోషల్ మీడియా లో పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.