Sandeep Vanga : ‘ముందు నీ భర్త సంగతి చూసుకో’ అంటూ అమీర్ ఖాన్ భార్య ని ఘోరంగా అవమానించిన సందీప్ వంగ!

- Advertisement -

Sandeep Vanga : గత ఏడాది డిసెంబర్ 1 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఎనిమల్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. రణబీర్ కపూర్ హీరో గా నటించిన ఈ సినిమా దాదాపుగా 900 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా ఈ సినిమా దాదాపుగా 80 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే ఈ సినిమా యూత్ ఆడియన్స్ కి ఏ రేంజ్ లో నచ్చిందో, ఫ్యామిలీ ఆడియన్స్ మరియు మహిళల నుండి అదే రేంజ్ నెగటివిటీ ని ఎదురుకుంది.

కారణం ఈ సినిమాలో మహిళల పట్ల హీరో హింసాత్మకంగా వ్యవహరించాడు అని. అంతే కాకుండా చాలా సన్నివేశాలు బోల్డ్ గా ఉండడం కూడా వాళ్లకు నచ్చలేదు. టాప్ సెలబ్రిటీస్ సైతం ఈ చిత్రాన్ని తీసిన సందీప్ రెడ్డి వంగ ని విమర్శించడం ఇటీవల కాలం లో మనం చూసే ఉంటాం.

ఇప్పుడు అలాంటి సెలబ్రిటీస్ జాబితా లో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా చేరింది. ఈ సినిమాని తీసిన డైరెక్టర్ ఎవరో స్త్రీ వ్యతిరేకి లాగ ఉన్నాడు అంటూ కామెంట్ చేసింది. దీనికి సందీప్ వంగ సమాధానం చెప్తూ ‘ ఒక్కసారి మీ మాజీ భర్త అమీర్ ఖాన్ హీరో గా నటించిన దిల్ సినిమా చూసి రండి. ఇందులో హీరో హీరోయిన్ ని ఏకంగా రేప్ చేసే స్థాయికి వెళ్తాడు.

- Advertisement -

ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్టు చూపిస్తారు. కానీ ఆమె చివరికి అమీర్ ఖాన్ తోనే ప్రేమలో పడుతుంది. ఈ సినిమా చూసినప్పుడు మీకు ఇలాంటివి ఏమి అనిపించలేదా, కేవలం నేను తీస్తేనే ఎందుకు విమర్శిస్తున్నారు. నేను సౌత్ ఇండియా నుండి వచ్చి, ఇక్కడ ఎదుగుతున్నాను అనే కదా మీకు బాధ’ అని చెప్పుకొచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com