Pushpa 2 Climax ఇంత దారుణంగా ఉండబోతుందా..పాపం బన్నీ ఫ్యాన్స్ ఏమైపోతారో!

- Advertisement -

Pushpa 2 Climax ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలలో ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప : ది రూల్’. 2021 వ సంవత్సరం డిసెంబర్ 17 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘పుష్ప ‘ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

ఆగస్టు 15 వ తారీఖున ఎట్టి పరిస్థితిలో విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు మేకర్స్. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చెప్పిన డేట్ కి సినిమా వచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది. కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి అయ్యిందట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

కేవలం లీకులు మాత్రమే కాదు, ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ట్విస్టులు కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏమిటంటే ఈ సినిమా క్లైమాక్స్ లో అల్లు అర్జున్ చనిపోతాడట. గత ఏడాది విడుదలైన గ్లిమ్స్ వీడియో లో అల్లు అర్జున్ ఎర్రచందనం ద్వారా సంపాదించిన డబ్బులు మొత్తం పేద ప్రజల కోసం ఉపయోగిస్తూ ఉన్నట్టుగా చూపిస్తారు.

- Advertisement -

అంటే రాబిన్ హుడ్ తరహా అన్నమాట. అయితే మొదటి నుండి అల్లు అర్జున్ పోలీసులు వెతికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. క్లైమాక్స్ లో ఆయన దొరికినప్పుడు అతన్ని షూట్ చేస్తారని టాక్. ఇది వరకు మన టాలీవుడ్ లో స్టార్ హీరోలవి యాంటీ క్లైమాక్స్ ఉన్న సినిమాలు సక్సెస్ అయ్యినట్టు చరిత్రలో లేదు. మరి పుష్ప 2 లో ఉన్న యాంటీ క్లైమాక్స్ ని కేజీఎఫ్ తరహాలో ఆదరిస్తారా లేదా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here