Sandeep Vanga : ఈమధ్య కాలం లో కొత్త డైరెక్టర్స్ టేకింగ్ కి జనాలు ఏ రేంజ్ లో బ్రహ్మరథం పడుతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. యూత్ ఆడియన్స్ ని ప్రధానంగా చేసుకొని ఈ డైరెక్టర్స్ తీస్తున్న సినిమాలకు కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, బాలీవుడ్ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటి డైరెక్టర్స్ లో ఒకరు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి అనే చిత్రం తో ఈయన సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు.

మళ్ళీ ఇదే సినిమాని హిందీ లో షాహిద్ కపూర్ తో ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసి సెన్సేషన్ సృష్టించాడు. ఈ సినిమా తో అందరి ద్రుష్టి సందీప్ వంగ పై పడింది. బాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయింది, అలా ఆయన రణబీర్ కపూర్ తో కలిసి ‘ఎనిమల్’ సినిమా తీసే అవకాశం దక్కింది. ఈ సినిమా రీసెంట్ గానే విడుదలై ఆడియన్స్ చేత ఏ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుందో మనమంతా చూసాము.

కేవలం మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే తెలుగు లో ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సందీప్ వంగ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఎనిమల్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

ఆయన మాట్లాడుతూ ‘నేను ఎనిమల్ చిత్రాన్ని ముందుగా మహేష్ బాబు తో చెయ్యాలని అనుకున్నాను అంటూ సోషల్ మీడియా లో ఒక పుకారు పుట్టించారు. మహేష్ బాబు ని ఆ యాంగిల్ లో నేను చూపిస్తే తెలుగు ఆడియన్స్ నన్ను చెప్పుతో కొడుతారు. ఆయనకీ వేరే కథ ఉంది, చెయ్యాల్సిన సమయం వచ్చినప్పుడు చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ వంగ.