Sandeep Master : పాపం పల్లవి ప్రశాంత్ ని అన్యాయం చేస్తున్నారు అంటూ సందీప్ షాకింగ్ కామెంట్స్.. సడన్ గా ఇలా ప్లేట్ తిప్పేశాడేంటీ!

- Advertisement -

Sandeep Master : బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఆడడం ఒక్కటే కాదు, తమ తోటి కంటెస్టెంట్స్ తో ప్రవర్తించే తీరు, ఆటలు ఆడే విధానం, ప్రవర్తన ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. కేవలం ఆట ఒక్కటి ఆడితే సరిపోదు, ఈ లక్షణాలు అన్నీ ఉండాలి. అప్పుడే సక్సెస్ కాగలరు, ఎక్కువ రోజులు హౌస్ లో ఉండగలరు. ఇవేమి లేకుండా కేవలం ఆటలు మాత్రమే ఆడితే సందీప్ లాగ ఎలిమినేట్ అవుతారు ఎవరైనా.

Sandeep Master
Sandeep Master

ఈ సీజన్ లో ఆయన అడుగుపెట్టిన రోజు నుండి , చివరి రోజు వరకు ఎంత సేఫ్ గా ఆడాలో, అంత సేఫ్ గా ఆడాడు. ఎంత పెద్ద మాస్కు వేసుకున్న కూడా రెండు మూడు వారాలకు బయట పడిపోతారు ఎలాంటి కంటెస్టెంట్ అయినా. కానీ సందీప్ మాస్టర్ మాత్రం 8 వారాలు ఆ మాస్కు వేసుకొనే నెట్టుకొచ్చాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు అమర్ దీప్ గ్యాంగ్ లో ఒకడిగా కొనసాగిన సందీప్, హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నాడు.

Nagarjuna Sandeep Master

ఇప్పుడు ఆయన ఎక్కువగా శివాజీ బ్యాచ్ మీద సానుభూతి చూపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. నిన్న కెప్టెన్సీ టాస్కు లో భాగంగా పల్లవి ప్రశాంత్ ని గౌతమ్ టీం తొలగించాల్సి వచ్చింది. దీనికి ఆట సందీప్ చాలా ఫీల్ అయిపోయాడు. ఆయన మాట్లాడుతూ ‘పాపం పల్లవి ప్రశాంత్ మంచి ప్లేయర్, వాడిని ఎందుకు గేమ్ నుండి తీసేసారు?, ప్రశాంత్ ఉంటే గేమ్ ఆడలేరా?, మరీ అంత భయమా?, ఆడితే అలాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ తో ఆడండి. బాగా ఆడే వాళ్ళని బయటకి పంపితే కిక్ ఉండదు. నేను కూడా స్ట్రాంగ్ ప్లేయర్ ని, నన్ను బయటకి నెట్టేశారు, ఆ బాధ నాకు బాగా తెలుసు’ అంటూ చెప్పుకొచ్చాడు సందీప్. అసలు హౌస్ లో ఇన్ని రోజులు మనం చూసిన సందీప్, ఇప్పుడు బయట చూస్తున్న సందీప్ ఒక్కటేనా?, ఇలా ఆయన ప్రవర్తన అర్థం కానీ విధంగా ఉంది కాబట్టే జనాలు బయటకి నెట్టేశారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here