Samyuktha: భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది సంయుక్త మీనన్.. ఆ తరువాత బింబిసారా సినిమాలో కూడా నటించింది.. వరుసగా తను నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవటంతో.. తన నెక్స్ట్ సినిమా సార్ పై అంచనాలు పెరిగిపోయాయి.. సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఓ రీల్ ను పంచుకోగా.. అది కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..

ధనుష్, సంయుక్త మీనన్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా సార్.. తమిళ్ లో వాతిగా తెరకెక్కుతున్న సినిమా తెలుగులో సార్ గా రానుంది.. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో సినిమాలపై అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ సినిమాలోనూ మాస్టర్ పాట ను తమిళ్ వర్షన్ లో ఓ రీల్ చేసింది సంయుక్త..

ఈ రీల్ కి ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి.. ఎక్స్ప్రెషన్ క్వీన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. ఫుల్ పింక్ కలర్ డ్రెస్ లో హొయలు పోతూ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది.. ఈ సినిమా పై హైప్ క్రియేట్ చేయడానికి మాస్టర్ మాస్టర్ అంటూ అందరినీ మరోసారి తన ఎక్స్ప్రెషన్ తో కనెక్ట్ చేసింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సంయుక్తా మీనన్ గా ఉన్న తన పేరు పక్కన తన ఇంటి పేరుని తొలగించేసింది ఈ బ్యూటీ. ఎందుకంటే తన పేరుతోనే తను సొంతంగా ఎదగాలని అనుకుంటున్నానని తెలిపింది. ఇక నీ పెళ్ళెప్పుడు అని పలు ఇంటర్వ్యూలో అడుగుతుండగా.. ఆ విషయంపై కూడా ఈ అమ్మడు స్పందించింది. అసలు పెళ్లి అవసరమా అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. మనల్ని అర్థం చేసుకునే వారు దొరికినప్పుడు చూద్దాంలే అంటూ సైలెంట్ గా తన పెళ్లి విషయాన్ని సైడ్ పెట్టేసింది సంయుక్త.