తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమర్షియల్ మాస్ సినిమాకి సరికొత్త నిర్వచనం తెలిపిన దర్శకుడు బి గోపాల్. అప్పటి వరకు మాస్ సినిమాలు అంటే ఒకే మూసలో ఉండేవి, కానీ ఈయన ఫ్యాక్షన్ జానర్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. ఈయన దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘సమరసింహా రెడ్డి’ చిత్రం టాలీవుడ్ లో ఫ్యాక్షన్ జానర్ సినిమాలకు నాంది పలికింది. అప్పట్లో ఈ చిత్రం సుమారుగా 16 కోట్ల రూపాయిలను సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.

ఇక ఆ తర్వాత మళ్ళీ బాలయ్య బాబు తోనే నరసింహ నాయుడు వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు, ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాల జోరు ఊపందుకుంది. ఇదే బి గోపాల్ చిరంజీవి తో ‘ఇంద్ర’ అనే ఫ్యాక్షన్ సినిమా తీసి, ఆయనకీ కూడా మరపురాని బ్లాక్ బస్టర్ హిట్ ని అందించాడు. ఈ సినిమా రికార్డ్స్ ని సుమారు నాలుగేళ్ల పాటు ఏ టాలీవుడ్ హీరో కూడా ముట్టుకోలేకపోయారు.

అలా చిరంజీవి , బాలకృష్ణ మరియు వెంకటేష్ వంటి స్టార్ హీరోలకు కెరీర్ లో మరుపురాని బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు బి.గోపాల్, అయితే ఆయనకీ ఎక్కువ బ్లాక్ బస్టర్ హిట్లు బాలయ్య తోనే ఉన్నాయి. వెంకటేష్ తో కూడా ఆయన ‘బొబ్బిలి రాజా’ వంటి మెగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని చేసాడు. అలా మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన ఎన్నో సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించిన బి గోపాల్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు గారికి ప్రియ శిష్యుడు.

‘అడవి రాముడు‘ చిత్రం నుండి సుమారుగా 12 ఏళ్ళ పాటు ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. దాదాపుగా 30 సినిమాలకు దర్శకత్వం వహిస్తే అందులో 70 సక్సెస్ రేట్ ఉన్న కమర్షియల్ డైరెక్టర్ ఆయన. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు అవకాశాలు లేక , సుమారుగా 14 ఏళ్ళ నుండి ఖాళీగా ఉన్నాడు. ఆయన మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలి, ఆయన మార్క్ మాస్ ని మిస్ అవుతున్నామంటూ అభిమానులు ఫీల్ అవుతున్నారు.మరి ఆయన రీ ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.
