Sakunthalam Collections : ఎన్నో అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ విషయంలో ఆడియన్స్ నిరాశకు గురయ్యారని టాక్ నడిచింది. మొత్తానికి ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. అంత కష్టపడినా కనీసం ప్రమోషన్ ఖర్చులు కూడా రాలేదని టాక్. దీంతో అంతా సమంత పని అయిపోయిందనుకుంటున్నారు. అటు నెటిజన్లు కూడా సమంత చేయలేదా.. గుణ శేఖర్ తీయలేదా అని అనుకుంటున్నారు.

ఏపీ తెలంగాణల్లో 1 కోటి , తమిళనాడులో 22 లక్షలు ప్రపంచ వ్యాప్తంగా 2.24 కోట్లు మాత్రమే వసూళ్లు చేసినట్లు సమాచారం. కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 20 లక్షలు వచ్చింది. ఇక ఓవర్సీస్ లో అయితే 74 లక్షల షేర్ కలెక్షన్స్ దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2.24 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక 4.70 కోట్ల గ్రాస్ వచ్చింది. శకుంతలం సినిమాకు పెద్దగా బజ్ లేకపోవడంతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక 19 కోట్ల టార్గెట్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు అయితే ప్రపంచవ్యాప్తంగా 2.24 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే ఇంకా సక్సెస్ కావాలి అంటే ఈ సినిమా 16.76 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా అనుకున్న టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం శాకుంతలం. శకుంతల, దుష్యంతుల ప్రేమకథను మరింత అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించాలని డైరెక్టర్ గుణశేఖర్ చేసిన ప్రయత్నమే ఈ సినిమా. విడుదలకు ముందు ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇందులో శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా మలయాళీ యంగ్ హీరో దుష్యంతుడు కనిపించగా.. వీరి కుమారుడు భరతుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించింది.