Samantha నాగ చైతన్యతో విడాకులు తీసుకుని చాలా రోజులు అయినా సమంత (Samantha) మాత్రం ఈ కుటుంబంతో టచ్ లోనే ఉంటుంది. చై, సామ్ ఇద్దరూ 2020లో విడిపోయారు. ఇక అప్పటినుంచి ఎవరు సినిమాలలో వారు బిజీగా ఉంటున్నారు. నాగచైతన్య తమ్ముడు అఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈరోజు అఖిల్ 28వ పుట్టినరోజు. తన పుట్టిన రోజును అంగరంగ వైభంవంగా జరుపుకుంటున్నాడు. ఈ క్రమంలోని టాలీవుడ్ బాలీవుడ్ నటీనటుల సైతం హ్యాపీ బర్తడే అంటూ విష్ చేస్తున్నారు.

అక్కినేని మాజీ కోడలు.. హీరోయిన్ సమంత (Samantha) కూడా తన మరిది అఖిల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. తాజాగా హ్యాపీ బర్తడే అఖిల్ అక్కినేని . ఏప్రిల్ 28న ఏజెంట్ రిలీజ్ అవుతుంది కదా.. చూస్తుంటే ఫైర్ లా ఉంది లాట్సాఫ్ లవ్ యు అంటూ రాసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది. సమంత తన ఇంస్టాగ్రామ్ నుంచి షేర్ చేసిన దీన్ని చూసి అక్కినేని అభిమానులు కూడా తెగ సంబరపడుతున్నారు. మరికొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు అఖిల్ పై ఫోకస్ పెట్టావా అని కామెంట్స్ చేస్తున్నారు.

అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలతో సమంత (Samantha) ఎప్పుడూ అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. అఖిల్, సుశాంత్ ల సినిమాలకు సమంత బెస్ట్ విషెస్ అందిస్తూ సోషల్ మీడియా ద్వారా పలు పోస్టులను తెలిపింది. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీలోనూ రానా మీహిక వెంకటేష్ కూతురు అశ్రీతలతో ఆమెకు మంచి అనుబంధం ఉన్నది. వాళ్లకు కూడా పలు సందర్భాల్లో సమంత విషెస్ చెప్పింది.
