Samantha : పుష్ప 2 ఆఫర్ ను రిజెక్ట్ చేసిన సమంత.. కారణం అదేనా?

- Advertisement -

Samantha : తెలుగు స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.. మొన్నటివరకు కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే ఈ అమ్మడు తాజాగా విడుదలైన అల్లు అర్జున్ సినిమా పుష్ప లో ఊ అంటావా మామా.. ఊఊ అంటావా ‘. దీంతో దేశవ్యాప్తంగా మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు.. ఆ తర్వాత ఎన్ని విమర్శలు, ప్రశంసలు అందుకుందో తెలిసిందే.. అయితే ఇప్పుడు పుష్ప 2 లో కూడా ఆఫర్ వచ్చిందట కానీ సామ్ అందుకు నో చెప్పిందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి..

Samantha
Samantha

సమంత చైతూతో విడిపోయే సమయంలో కాస్తా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్‌’తో కేరీర్ ను రీస్టార్ట్ చేశారు. ఈచిత్రంలో సమంత స్పెషల్ నెంబర్ లో అలరించిన విషయం తెలిసిందే..తన కేరీర్ లో చేసిన ఒకే ఒక్క ఐటెం సాంగ్ ‘ఊ అంటావా మామా.. ఊఊ అంటావా ‘. 2021లో వచ్చిన ఈచిత్రంలో సమంత ఐటెం సాంగ్ లో నటించడం సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. కానీ ఈపాటు దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. సమంత గ్లామర్ స్టెప్పులకు అంతా ఫిదా అయ్యారు. ఆ సాంగ్ తో తన లైఫ్ పూర్తిగా మారిపోయింది..

Samantha pushpa
Samantha pushpa

పుష్ప2‘లో సమంత కోసం దర్శకుడు సుకుమార్ ఓ ప్రత్యేకమైన రోల్ ను క్రియేట్ చేస్తున్నారని.. అది కథను మరో లెవల్ కు తీసుకెళ్తుందని అప్పట్లో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ప్రస్తుతం సినీ వర్గాల్లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుండటం విశేషం.. సమంతకు సీక్వెల్ లోనూ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. తనను మరోసారి స్పెషల్ నెంబర్ లో నటించేందుకు సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే సామ్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ లకు సైన్ చేయడంతో ప్రస్తుతం స్పెషల్ నెంబర్స్ లో నటించే ఛాన్స్ లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది.. దాంతో చిత్ర యూనిట్ ఆమెను ఒప్పించే పనిలో పడ్డారట.. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here