Samantha : అల్లు అర్జున్ తో కలిసి అలా చేయాలని ఉంది.. పబ్లిక్ ఈవెంట్ లో పచ్చిగా చెప్పిన సమంత

- Advertisement -

Samantha : అమెరికన్‌ సూపర్‌ హీరో సినిమా ‘ది మార్వెల్స్‌’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. దీపావళి కానుకగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీమ్‌ అన్ని ప్రాంతాల్లో ప్రమోషన్స్‌ జోరు పెంచింది. హైదరాబాద్‌లో ఓ గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో నటి సమంత పాల్గొని సందడి చేశారు.

Samantha
Samantha

అలాగే ఓ సినిమాకు సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేసి సినీ ప్రియుల్లో జోష్‌ పెంచారు. అమెరికన్ సూపర్ హీరోస్‌కు తానెప్పుడూ అభిమానినని చెప్పే సమంత ‘ది మార్వెల్స్‌’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ‘‘ఈ దీపావళి సినీ ప్రియులకు మరింత వినోదాన్ని పంచనుంది. దీని ప్రమోషన్స్‌లో నేను భాగం కావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. చెడుపై మంచి సాధించే అంతిమ యుద్ధం కోసం ఈ సారి ఒకరు కాదు ఏకంగా ముగ్గురు సూపర్‌ హీరోలు పోరాడనున్నారు. ఈ యాక్షన్‌ మూవీ పండగను మరింత ప్రత్యేకం చేయనుంది. థియేటర్లో చూసి సర్‌ప్రైజ్‌ కావడానికి అందరూ సిద్ధంగా ఉండండి’’ అని సమంత తెలిపారు.

ఇక తాను ‘ఎవెంజర్’ అయి తనకు ఓ ప్రత్యేకమైన టీమ్ ఉంటే అందులో తన అభిమానులు ఉండాలని కోరుకుంటానని సమంత చెప్పుకొచ్చింది. ఇక ఇండియన్ హీరోలు తన టీమ్ లో ఉండాలనుకుంటే, తెలుగు నుంచి అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఉండాలని కోరుకుంటానని వెల్లడించింది. ఇక బాలీవుడ్ నుంచి ఆలియా, హాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రా కూడా తన టీమ్ లో ఉండాలని భావిస్తున్నట్లు చెప్పింది. ఇక ఈ చిత్రంలో కెప్టెన్ మార్వెల్‌ తో పాటు మిస్ మార్వెల్‌, కెప్టెన్ మొనిక‌ కూడా ఉంటార‌ని సమంత వెల్లడించింది. ఈ ముగ్గురు కలిసి చేసే యాక్షన్ సీక్వెన్స్ అందరినీ ఆకట్టుకుంటాయన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here