Samantha: సమంతకు ఫోన్ చేసిన నాగచైతన్య.. జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్న సామ్

- Advertisement -

Samantha: నాగ చైతన్య, సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇద్దరు కలిసి నటించిన తొలి సినిమాతోనే మంచి స్నేహితులుగా మారారు. కొంత కాలం తర్వాత స్నేహం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎవరికి వారు వేర్వేరుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. వీరిద్ద‌రు ఎందుకు విడాకులు తీసుకున్నానేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్స్ ప్ర‌శ్న‌గా మారింది.

Samantha
Samantha

తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఆడియో ఒకటి ఇప్పుడు వైరలవుతోంది. రారండోయ్‌ వేడుక చూద్దాం సినిమా టైమ్‌లో నాగచైతన్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (rakul preet singh) కలిసి పాల్గొన్నారు. షో మధ్యలోనే సమంతకి ఫోన్ చేయ‌గా, అప్పుడు లౌడ్‌ స్పీకర్‌ పెట్టి మరీ.. ప్రపంచంలో ఇంత మంది అందమైన అమ్మాయిలు ఉండగా నేను సమంతనే ఎందుకు ప్రేమించాను అని చైతూ ప్ర‌శ్నించాడు. అప్పుడు వాటికి స‌మాధానంగా సామ్‌ స్పందిస్తూ,ఎందుకంటే నేను నీకు ఆప్షన్‌ ఇవ్వలేదుఅంటూ క్రేజీ ఆన్సర్‌ ఇచ్చింది . వెంట‌నే నాగచైతన్య స్పందిస్తూ, నాకు ఇంకో ఆప్షన్‌ కూడా వద్దులే అని చెప్పడంతోఐ లవ్యూ` అని చెప్పింది సామ్‌. ఈ స‌మాధానానికి అంద‌రు ఫిదా అయిపోయారు. ఈ సంఘ‌ట‌న ఎప్పుడో జ‌రిగిన‌ప్ప‌టికీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది.ఇది చూసి ఫ్యాన్స్ మరోసారి ఈ జోడి కలిస్తే బాగుండు అనుకుంటున్నారు.

naga chaithanya

ఇక మరోవైపు సామ్ కూడా వీరిద్దరి జ్ఞాపకాలు మర్చిపోలేక పోతుంది. తాజాగా సిటడెల్ లండన్ ప్రీమియర్‌ ఈవెంట్‌లో పాల్గొన్న సామ్.. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే నెటిజన్లు మాత్రం చై పచ్చబొట్టు ఇంకా ఉండటాన్ని పసిగట్టి నెట్టింట కామెంట్లను విసురుతున్నారు. ఇంకా నాగచైతన్య టాటూను ఉంచారా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. విడాకులైన తర్వాత కూడా చై పేరును తొలగించకపోవడానికి కారణమేంటని అడుగుతున్నారు. అయితే ఈ విషయంపై సామ్ ఇంకా ఎలాంటి స్పందన తెలియజేయలేదు.

- Advertisement -
sam

సమంత, చైతన్య ఇద్దరూ తమ మోచేతికి రెండు బాణాల రూపంలో మ్యాచింగ్ టాటూలను వేయించుకున్నారు. సామ్ కుడి చేతికి ఈ పచ్చబొట్టు ఉంటుంది. నాగచైతన్య తమ పెళ్లి రోజును పచ్చబొట్టుగా పొడిపించుకున్నారు. సామ్ కూడా తన రిబ్స్ వద్ద చై పేరును టాటుగా వేయించుకుంది. 2010లో ఏమాయే చేసావే సినిమాతో తొలిసారిగా నాగచైతన్య, సామ్ కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడిన వీళ్లిద్దరూ 2017లో వివాహంతో ఒక్కటయ్యారు. నాలుగేళ్లు సజావుగా సాగిన వీరి బంధం.. ఆ తర్వాత మాత్రం విడాకులకు దారితీసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com