నిక్కరేసుకుని డ్యాన్స్ చేసిన సమంత.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..

- Advertisement -

టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత.. షూటింగులకు కాస్త బ్రేక్ ఇచ్చి.. విదేశాల్లో ట్రిప్​ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలె తమిళనాడు కోయంబత్తూర్​లోని సద్గురు ఇషా ఫౌండేషన్​ సందర్శించి.. ఆ తర్వాత పలు ఆలయాలను చుట్టి, స్నేహితులతో కలిసి ఇండోనేసియా వెళ్లారు సమంత. అక్కడి ప్రదేశాలను, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. ఎప్పటికప్పుడు ఆ ఫొటోలను సమంత సోషల్ మీడియాలో షేర్​ చేశారు. రీసెంట్​గా తను ఐస్ బాట్​ టబ్​ అంటూ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరలయ్యింది. ఆరు నిమిషాల పాటు నాలుగు డిగ్రీల సెల్సియస్ ఐస్​ నీళ్లలో కూర్చున్నారు. కాగా తాజాగా తన స్నేహితురాలితో కలిసి ఇండోనేసియా బాలిలో ‘మంకీ ఫారెస్ట్’​ను సందర్శించారు.

సమంత
సమంత

అక్కడ కోతులతో సరదాగా గడిపారు. అక్కడ ఓ కోతి .. ఏకంగా సమంతతో సెల్ఫీ దిగింది. అయితే ఆ సెల్ఫీలో సమంత, తన ఫ్రెండ్ ఫొటోకు పోజునిస్తే.. కోతి సెల్ఫీ తీసింది. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. అలాగే రీసెంట్‌గా 4డిగ్రీల చలిలో ఆరు నిమిషాలు ఐస్‌ బాత్ చేసినట్లు ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ పెట్టింది. కాగా తాజాగా తన ఫ్రెండ్‌తో కలిసి డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. గ్రుపో రఫగా బ్యాండ్‌ స్వర పరిచిన మెంటిరోసా మ్యూజిక్‌కు తన స్నేహితురాలితో కలిసి గూఫి డ్యాన్స్‌ వేసింది. ఈ పొట్టి నిక్కరు డ్యాన్స్ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్‌ చేస్తుంది. అయితే దీన్ని చూసిన కొందరు చికిత్స కోసం వెళ్లారా.. ఎంజాయ్ చేయడానికి వెళ్లారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Samantha

ఇక సమంత గతకొంత కాలంగా మయోసైటిస్‌తో బాధపడుతుంది. ఆ మధ్య కొన్ని రోజులు షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చి మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. ఇక ఇప్పుడు చికిత్స నిమిత్తం ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోనుంది. ఇక ప్రస్తుతం సామ్‌ నటించిన ఖుషీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. విజయ్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన పాటలు ఇన్‌స్టాంట్‌గా ఎక్కేశాయి. ఇక టీజర్‌ను వచ్చే వారం విడుదల చేస్తున్నట్లు సమాచారం. దీనితో పాటుగా వరుణ్‌ ధావన్‌తో కలిసి చేసిన సిటాడెల్ వెబ్‌ సిరీస్‌ సెప్టెంబర్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com