Kriti Sanon : కొత్త వ్యాపారంలోకి కృతి సనన్.. అన్ని డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి తల్లీ..!

- Advertisement -

Kriti Sanon : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ క్రేజ్ గురించి తెలిసిందే. రీసెంట్ గానే ‘ఆదిపురుష్’ వంటి పాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ మూవీలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ జోడిగా జానకి దేవి పాత్రలో మంచి నటనను కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఆదిపురుష్’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కానీ సినిమాలో జానకి దేవిగా కృతి సనన్ అద్భుతమైన హావభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.

Kriti Sanon :
Kriti Sanon

ఒక వైపు సినిమాలతో తెగ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా సరికొత్త వ్యాపారం లోకి అడుగు పెట్టింది. తాజాగా కృతి సనన్ సొంతంగా ఓ స్కిన్ కేర్ బ్రాండ్ ను లాంచ్ చేసింది. తన స్కిన్ స్కేర్ బ్రాండ్ కి ‘హైఫన్’ అనే పేరును ప్రకటిస్తూ స్కిన్ కేర్ బ్రాండ్ ని స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఇందులో 100% శాకాహార, ప్లాస్టిక్ రహిత పదార్థాలతో ఉత్పత్తులు ఉండబోతున్నాయని తెలిపింది. అంతేకాకుండా తన బ్రాండ్ పెటా ఆమోదం కూడా పొందింది అని తెలిపింది. తన బర్త్‌డే సందర్భంగా స్కిన్ కేర్ బ్రాండ్ లాంచ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ బ్రాండ్ కు సంబంధించిన వీడియోని అభిమానులతో పంచుకుంది కృతి సనన్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కృతి సనన్ పోస్ట్ చేస్తూ.. “ఫైనల్‌గా మీ అందరిని హైఫన్ ప్రపంచానికి స్వాగతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

నా అభిరుచి ఈరోజు కలగా మారినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక ఇందులో పవర్ ప్యాక్డ్ ఉత్పత్తులను తయారు చేయాలనేదే నా కల. నా పుట్టినరోజు సందర్భంగా ఈ బ్రాండ్ ని బయటకు తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన హైఫన్ బృందానికి, నా కో ఫౌండర్స్ కి కృతజ్ఞతలు. ఇది నా బర్త్ డే కి ది బెస్ట్ గిఫ్ట్” అంటూ కృతి సనన్ పేర్కొంది. ఇక హైఫన్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే.. వాటి ధర రూ.449 మొదలకుని రూ.649 వరకు ఉంది. ప్రస్తుతం నాలుగు ప్రొడక్ట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక కృతి సనన్ తన స్కిన్ బ్రాండ్ గురించి చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here