Samantha : సమంత నాగచైతన్య పదేళ్లపాటు ప్రేమించుకున్న తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు కానీ.. వారి పెళ్లి మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకుంటున్నామంటూ అధికారికంగా ప్రకటించి వారి ఫ్యాన్స్ కి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చారు. ఇక వీళ్లిద్దరు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న.. సమంతా కెరియర్ పై ఫుల్ ఫోకస్ పెట్టి సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. నాగచైతన్య మాత్రం రెండో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ సోషల్ మీడియాలో వార్తలు గ్రూప్ అంటున్నాయి..

మరోపక్క నాగచైతన్య శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో నాగచైతన్య లండన్ లో శోభితతో కలిసి కనిపించడం ఇప్పుడు చర్చిని అంశంగా మారింది ఇప్పుడు ఇదే అంశంపై సమంత తన సన్నిహితులతో స్పందించినట్లు సమాచారం.

సమంత తన సన్నిహితులతో.. ఎవరు ఎవరితో వెళ్లిపోతే నాకేం అవసరం. ప్రేమ అంటే విలువ లేని వారు.. ప్రేమకి అర్థం తెలియని వారు.. ఎంతమందితో డేటింగ్ చేసినా చివరికి కన్నీళ్లే మిగులుతాయి, కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉంటే చాలు. ఇప్పటికైనా బిహేవియర్ మార్చుకుని ఆ అమ్మాయిని బాధపెట్టకుండా చూసుకుంటే బెటర్ అని సమంత తన సన్నిహితులతో చెప్పినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ సమంత కు మాత్రం చైతు అంటే ఇంకా ఏదో మూల ప్రేమ ఉన్నట్టు కనిపిస్తుందని అంటున్నారు అభిమానులు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి పోతే చూడాలని ఇద్దరి అభిమానులు కోరుకుంటున్నారు..