తనని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను.. ఫొటో కూడా షేర్ చేసిన సమంత

- Advertisement -

సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను ధైర్యంగా రివీల్ చేయడంలో హీరోయిన్ సమంత ముందుంటుంది. అలాగే జెండర్‌తో సంబంధం లేకుండా తనకు క్లోజ్ ఫ్రెండ్స్‌‌తో బాండింగ్‌ గురించి ఇప్పటికే అనేక పోస్టుల ద్వారా వెల్లడించింది. వారితో ఫన్ మూమెంట్స్‌కు సంబంధించిన పిక్స్ కూడా పోస్ట్ చేస్తుంటుంది. ఇటీవలే కోస్టార్ విజయ్ దేవరకొండ పిక్ షేర్ చేస్తూ.. అతను కష్ట సమయాల్లో తనకు ఎలా సపోర్టివ్‌గా ఉన్నాడో చెప్పుకొచ్చింది సమంత. ఇదే క్రమంలో తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్, యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌ ఫొటో షేర్ చేసిన సామ్.. అతని మంచితనాన్ని వివరిస్తూ ఎప్పటికీ ప్రేమిస్తుంటానని తెలిపింది.

సమంత
సమంత

సమంత తన పోస్ట్‌లో రాస్తూ.. మీకు తెలిసిన మంచి వ్యక్తిని తీసుకుని వందసార్లు మల్టీప్లై చేస్తే అది నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ అవుతాడు. రాహుల్ నిన్ను జీవితాంతం ప్రేమిస్తుంటా.. తను ఫుడీ అయినప్పటికీ మీతో కంపెనీ ఇవ్వడానికి దాన్ని వదులుకుంటాడు. కానీ ఎంత బాధపడతాడో’ అని సరదాగా పేర్కొంది. ఈ పోస్ట్‌కు రాహుల్ సైతం ఫన్నీగానే రిప్లయ్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రాహుల్ భార్య సింగర్ చిన్మయి.. సమంతకు క్లోజ్ ఫ్రెండ్.. సమంత చాలా సినిమాలకు ఆమె డబ్బింగ్ చెప్పేవారు.

ఇక సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ నటుడు వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మామూలుగా సమంత ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అయితే ఈ సిరీస్ కోసం మాత్రం ఓ రేంజ్‌లో అంటే పది కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఈరేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకోలేదని టాక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here