Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పాపులారిటీని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సమంతకి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే.. ముఖ్యంగా ఆమెను ఆరాధించే వాళ్ళు.. ఆమె బాగోగుల గురించి పట్టించుకునే వారే ఎక్కువ.. తాజాగా సమంత ని తన వ్యక్తిగత విషయం గురించి ఓ నేటిజన్ అయిన అభిమాని ప్రశ్నించగా.. సమంత హార్ట్ టచింగ్ ఆన్సర్ ఇచ్చింది.

సమంత నటించిన మైథాలజికల్ సినిమా శాకుంతలం.. ఈ చిత్రం ఏప్రిల్ 14న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్ , పోస్టర్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. .సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో సమంత యాంకర్ సుమతో కలిసి ముచ్చటిస్తూ శాకుంతలం సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇక అదే వీడియోను సమంత అభిమాని షేర్ చేస్తూ.. ఈ విషయం మీతో చెప్పే అంత చనువు నాకు లేదని తెలుసు.. ప్లీజ్ సామ్ మీరు ఎవరితోనైనా డేట్ చేయండి అని ఆమె కోరింది.. దీనిపై సమంత స్పందిస్తూ.. మీకు లాగా నన్ను ఎవరు ప్రేమిస్తారు అంటూ హాట్ ఎమోజిని షేర్ చేసింది.. సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. కాగా ఇప్పుడు ఈ మేటర్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది సమంత చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
Who will love me like you do 🫶🏻 https://t.co/kTDEaF5xD5
— Samantha (@Samanthaprabhu2) March 26, 2023