సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి వార్తనే వెంటనే తెలిసి పోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలోనైతే ఏ చిన్న వార్తయినా వెంటనే వైరల్ అవుతోంది. కాస్త నెగిటివ్ కనిపిస్తే చాలు వాళ్లపైన ట్రోలింగ్ చేసేందుకు కాచుకుని కూర్చుంటున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది. అప్పటివరకు ఆహా ఓహో అని పొగిడిన వాళ్లే.. కాస్త నెగిటివ్నెస్ కనిపిస్తే చాలు సదరు సెలబ్రిటీని బండ బూతులు తిడుతూ కామెంట్ చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు స్టార్ హీరోయిన్ సమంత. అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో తాను ట్రోలింగ్ కు బాగా గురవుతోంది.

కానీ దానిని ఆమె పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ట్రోలర్స్ మాత్రం రోజురోజుకు హద్దుమీరుతున్నారు. సమంతకి సంబంధించిన ఏ విషయాన్ని అయినా నెగిటివ్ గా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం వెలుగులోకి తెచ్చి ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. ట్రోలర్స్ వాడిన వీడియోలో త్రివిక్రమ్ – మహేష్ బాబు కూడా ఉన్నారు. కాగా సమంత- మహేష్ బాబు – త్రివిక్రమ్ కలిసి ఓ షోలో పాల్గొంటారు. ఈ క్రమంలోనే సమంత మహేష్ ను ..‘ఏంటి సార్ చిన్న హీరోలు కూడా షర్ట్ తీసేసి సిక్స్ ఫ్యాక్ చూపిస్తున్నారు.. మరి మీరు ఎప్పుడు మాకు అలాంటి సిక్స్ ఫ్యాక్ చూపించబోతున్నారు. అని అడిగింది.. దీంతో మహేశ్ సిగ్గుపడుతూ.. ‘నేను విప్పను.. నేను చూపించను .. నేను చూపిస్తే ఎవరూ చూడరు’ అంటూ ఓపెన్ అయ్యాడు. పక్కనే ఉన్న త్రివిక్రమ్ సైతం దీనికి కౌంటర్ వేశారు. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని కావాలనే కొందరు ఆకతాయిలు సమంతని ట్రోల్ చేయడానికి ఈ వీడియోని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు.