సమంత కి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అయిపోతుంది. ఆమెకి ఉన్న క్రేజ్ అలాంటిది, మరీ ముఖ్యంగా నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత అయితే ఈమె నిత్యం వార్తల్లోనే ఉంటుంది. ఈమె మీద వచ్చినన్ని కథనాలు ఇండియా లో ఏ సెలబ్రిటీ మీద కూడా వచ్చి ఉండదు అనడం లో ఎలాంటి అతిసయోక్తి లేదు.

ఇకపోతే రీసెంట్ గా ఈమె యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి పబ్లిక్ స్టేజి మీద రొమాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియా లో ఎంతలా పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. పొట్టి పొట్టి దుస్తులు ధరించి, కోట్లాది మంది జనాలు చూస్తున్నారు అని కూడా పట్టించుకోకుండా వీళ్లిద్దరు చేసిన రొమాంటిక్ పెర్ఫార్మన్స్ అందరినీ ఎంతగానో ఆశ్చర్యపోయేలా చేసింది. సమంత తన కెరీర్ మొత్తం మీద ఇలా చెయ్యడం ఇదే తొలిసారి.

అయితే సమంత ఇప్పటికీ ధరించే బట్టలకు ఆదర్శం మరెవరో కాదు, ఆమె తల్లి ‘నిన్నెతే ప్రభు’ అని కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్. ఈమె గతం లో సమంత తో కలిసి ఎన్నో ఈవెంట్స్ లో పాల్గొన్నది. ఎప్పుడు బయటకి వచ్చిన చక్కగా సంప్రదాయబద్దంగా చీరలో కనిపించేది. కానీ లేటెస్ట్ ఫోటోలలో మాత్రం సమంత తో కలిసి విమానాశ్రయం లో నడుస్తూ, మోడరన్ వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వయస్సులో కూడా ఆమె మోడరన్ లుక్ లో కనిపిస్తుంది.

ఆమెకి ఉన్న ఆ అలవాట్లే వారసత్వం గా కూతురుకి కూడా వచ్చింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పోతే సమంత అతి త్వరలోనే తనకి సోకిన ‘మయోసిటిస్’ అనే ప్రాణాంతక వ్యాధికి సంబంధించిన చివరి ట్రీట్మెంట్ ని చేయించుకోవడం కోసం అమెరికా కి వెళ్తుంది. ట్రీట్మెంట్ చేయిచుకొని ఆరోగ్యం తో మీ ముందుకు వస్తాను అంటూ రీసెంట్ గా ఖుషి ఈవెంట్ లో కూడా చెప్పుకొచ్చింది. ఆమె సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం.