Samantha : హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ కు పరిచయం అయింది సమంత. మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తరువాత కొన్నేళ్ల పాటు తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది సమంత. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఈ జంట డివోర్స్ తీసుకుని విడిగా ఉంటున్నారు.
ఆమె గత కొంతకాలంగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాలు చేసేందుకు కాస్త గ్యాప్ ఇచ్చింది. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషి’ తన ఆఖరి చిత్రం. తరువాత ఆమె మళ్లీ వెండితెర మీద కనిపించ లేదు. ఇటీవలే ఆమె తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. తాజాగా సిరీస్‌కు సంబంధించిన టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ టైటిల్ గా ”హనీ, బన్నీ” పెట్టినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా సమంతను హీరోయిన్గా సెలక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సమంత తాజాగా సమంత తన పిల్లితో ఆడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సమంత పిల్లితో ఆడుకుంటూ దానికి లిప్ లాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు సినిమాలు లేకపోవడంతో పిల్లికి ముద్దులు పెడుతుందంటున్నారు.
పెంపుడు పిల్లికి లిప్ లాక్ ఇచ్చిన సమంత….!#Samantha #SamanthaRuthPrabhu #ViralVideo #Tollywood #FOneindiatelugu pic.twitter.com/4kOP99Xgyb
— oneindiatelugu (@oneindiatelugu) May 23, 2024