Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ బారిన పడి కొన్నాళ్లు షూటింగ్ కి విరామం ఇచ్చారు. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకోవడంతో గతంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసే పనిలో పడ్డారు. సమంతకు వృత్తి పట్ల ఎంతో నిబద్ధత ఉందని తాజాగా పోస్ట్ చేసిన వీడియోతో అర్థమవుతుంది. ఎముకలు కొరికే చలిలో తన క్యారెక్టర్ కోసం సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తోంది సమంత. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..
అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిటాడెల్ సిరీస్ కి సమంత సంతకం చేసిన విషయం తెలిసిందే. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. మొదటి షెడ్యూల్ ముంబైలో పూర్తి చేశారు ఇక తాజా షెడ్యూల్ ను ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో ప్లాన్ చేశారు. ఈ షూటింగ్ లో భాగంగా సమంత తన పాత్ర కోసం ఎనిమిది డిగ్రీల చలిలో స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సిటాడెల్ సిరీస్ కి యానిక్ బెన్ యాక్షన్ కొరియోగ్రాఫీ లో సమంతకు ట్రైనింగ్ ఇస్తున్నారు.
8° చలిలో సమంత ప్రాక్టీస్ చేస్తుండడం చూసి హాండ్స్ ఆమె డెడికేషన్ కి ఫిదా అవుతున్నారు. నేటిజన్స్ కూడా ఆమె పాత్ర కోసం ఇంత డెడికేటెడ్ గా ఉండడం చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సమంతా దీనికి సంబంధించిన వీడియోను సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసుకుంది. ఇటీవల మనోజ్ బజ్ పాయ్ కూడా ఆమె హార్డ్ వర్క్ ని కొనియాడారు. కొన్ని సీన్స్ కోసం సమంత బాడీని రిస్క్ లో పెట్టి మరీ చేశారు ఇలాంటి హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్ ని నేను చూడలేదు అంటూ సమంత ను అభినందించారు.
కాగా ఆమె డై హార్ట్ ఫ్యాన్స్ తో పాటు మరికొంతమంది నేటిజన్స్ మాత్రం సమంత ఇలాగా స్టంట్స్ చేసి మళ్లీ తన ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది తెచ్చుకుంటుందేమోనని ఆలోచనలో.. నిన్ను వర్కౌట్ చేయొద్దు అని ఆరోగ్యం మళ్ళీ ఏమైపోతుందో అని ఇలాంటి రిస్కీ వర్కౌట్స్ చేయొద్దు అని సలహా ఇస్తున్నారు. నీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా.. వర్కౌట్స్ చేయలేకుండా ఆగలేకపోతున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా తనమీద ప్రేమతో అని నెటిజన్స్ అంతా అనుకుంటున్నారు.