Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది. అయితే అంతకుముందు తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునే సామ్ ప్రస్తుతం కేవలం సినిమాలకు సంబంధించిన న్యూస్ మాత్రమే పంచుకుంటోంది. మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడిన తర్వాత సామ్ మళ్లీ సోషల్ మీడియాలోకి కమ్ బ్యాక్ ఇచ్చింది.

మరోవైపు అంతకుముందు తను ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ లో బిజీ అయింది. సిటాడెల్, ఖుషీ సినిమాల షూటింగులో బిజీగా ఉంది. మరోవైపు శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో సమంత సందడి చేస్తోంది. తాజాగా సామ్ స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చి నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. స్టైలిష్ లుక్ లో మెరిసి అభిమానులను అలరించింది.

ఫుల్ స్లీవ్ బ్లేజర్, లూజ్ ఫిట్ పాయింట్ ధరించి సమంత నయా లుక్ లో కనిపించింది. అట్రాక్టివ్ జ్యువెల్లరీ ధరించి కాస్త ట్రెండీనెస్ ను యాడ్ చేసింది. మరోవైపు సన్ గ్లాసెస్, బ్రాండెడ్ షూస్ తో సూపర్ కూల్ లుక్ లో కనిపించింది. మరోవైపు బ్లేజర్ పై రెండు బటన్స్ విప్పేసి ఎద అందాలతో గ్లామర్ టచ్ ఇచ్చింది. కిల్లింగ్ పోజుల్లో కిల్లర్ లుక్స్ తో కిర్రాక్ కైపెక్కించింది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే సమంత లేటెస్ట్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఏప్రిల్ 14న సినిమా విడుదల కాబోతుందంటూ గుర్తుచేసింది. ఏదేమైనా ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

సామ్ లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. స్టైలిష్ లుక్ లో ఈ బ్యూటీ తన అందంతో మరోసారి మెస్మరైజ్ చేసింది. గోల్డెన్ కలర్ బ్లేజర్ లో సామ్ మెరిసిపోయిందంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. సమంత లుక్స్ చూసి కుర్రాళ్లు ఆమె మాయలో పడిపోయారు. ఏం మాయ చేశావే అంటూ తెగ పొగిడేస్తున్నారు.

సమంత స్టైలిష్ లుక్ చూసి కేవలం నెటిజన్లే కాదు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. సమంత స్టన్నింగ్ లుక్ చూసి మిల్క్ బ్యూటీ తమన్నా కామెంట్ చేసింది. కామెంట్ సెక్షన్ లో మూడు ఫైర్ ఎమోజీలను జత చేస్తూ.. సమంత లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంటూ వర్ణించింది. మరోవైపు వెన్నెల కిషోర్ కూడా ఫైర్ అండ్ హార్ట్ ఎమోజీలను వదిలారు.