Samantha : బ్లాక్ డ్రెస్సులో బోల్డ్ ట్రీట్ ఇస్తున్న సమంత..ఇంత చేంజ్ ఏంటి భయ్యా..

- Advertisement -

Samantha : టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత మొన్నటివరకు పద్ధతి కనిపించింది.. ఇప్పుడు ట్రేండి లుక్స్ లో బోల్డ్ ట్రీట్ ఇస్తూ షాక్ ఇచ్చింది. బ్లాక్ స్కిన్ ఫిట్ డ్రెస్సులో ఊహించని రీతిలో రెడీ అందరిని ఆకట్టుకుంది.. తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.. అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి..సమంత శాకుంతలం సినిమా తర్వాత ఇంగ్లాండ్ కు వెళ్లిన విషయం తెలిసిందే..అక్కడ జరిగిన ఈవెంట్ కు హాజరైన సామ్ లుక్ ఇప్పుడు వైరల్ మారింది..

Samantha
Samantha

అక్కడ సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ షో ప్రదర్శనకు హాజరయ్యారు. సిటాడెల్ టీమ్ రాజ్ అండ్ డీకే, హీరో వరుణ్ ధావన్ లతో పాటు సమంత ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. సిటాడెల్ ఇంటెర్నేషనల్ సిరీస్. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ఇంటర్నేషనల్ ప్రీమియర్ కి ఆమె హాజరయ్యారు.. సమంత నటిస్తున్న సిటాడెల్ సిరీస్ చిత్రీకరణ దశలో ఉంది. సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ ఈవెంట్ కి సమంత సూపర్ స్టైలిష్ గా తయారయ్యారు. ఇంటెర్నేషనల్ ఈవెంట్ కి మ్యాచ్ అయ్యేలా బ్లాక్ డ్రెస్సులో సమంత లుక్ అందరిని ఆకర్శించింది..

Samantha Varun Dhawan

సినీ ప్రముఖులు కూడా ఈ లుక్ పై భిన్నభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు..కాగా,దేశం మారగానే సమంత వేషం మార్చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో సమంత తెల్లని వస్త్రాలలో కనిపించారు. చీర కట్టి, చేతిలో జపమాల పట్టి చాలా సాదాసీదాగా, ప్రశాంతమైన లుక్ మైంటైన్ చేశారు.

- Advertisement -
Varun Dhawan Samantha

సిటాడెల్ ప్రీమియర్ షోలో దానికి పూర్తి భిన్నంగా ఆమె పాల్గొన్నారు.. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం వసూళ్లు దారుణంగా ఉన్నాయి. పెట్టుబడిలో ఐదు పది శాతం కూడా తిరిగొచ్చే పరిస్థితి లేదు. సాయంత్రం నుండి శాకుంతలం థియేటర్స్ ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి.. ప్రస్తుతం సమంత సిటాడెల్ తో పాటు విజయ్ దేవరకొండ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ ఖుషి టైటిల్ తో ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. ఖుషి చిత్రీకరణ చివరి దశకు చేరింది. సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.. మరి ఆ సినిమా సమంత ఏ మాత్రం హిట్ ను అందిస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here