Samantha సోషల్ మీడియా లో సమంత ఎప్పుడు ఏమి పోస్ట్ పెట్టినా, ఏమి కామెంట్ చేసిన సోషల్ మీడియా మొత్తం ఊగిపోతాది.ఆమెకి ఉన్న క్రేజ్ అలాంటిది మరీ.అక్కినేని నాగ చైతన్య తో విడాకులు అయిపోయిన తర్వాత ఆమె ‘మయోసిటిస్’ వ్యాధితో బాధపడి శస్త్ర చికిత్స తీసుకొని ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది.ఆమె ఇలా సురక్షితంగా బయటపడడానికి డాక్టర్లే ముఖ్య కారణం, కానీ సమంత తానూ కొలిచే ‘లింగ భైరవి’ అమ్మావారి మొక్కు కూడా అందుకు కారణం అని రీసెంట్ గా జరిగిన కొన్ని ఇంటెర్వ్యూస్ లో తెలిపింది.

ఇక ఈరోజు ఆమె తన నివాసం లో అమ్మవారి దైవారాధన లో మునిగిపోయి,పూజలు చేస్తున్న ఫోటో ని అభిమానులతో పంచుకుంటూ ‘నమ్మకమే మన జీవితం లో ప్రధానమైన బలం..విశ్వాసమే మిమల్ని సుఖం గా ఉంచుతుంది’ అని కాప్షన్ పెట్టింది.ఈ ఫోటో గురించి అభిమానులు చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.దానికి ఒక కారణం కూడా ఉంది.

ఎందుకంటే సమంత క్రైస్తవ మతం లో పుట్టిన ఆడబిడ్డ.నాగ చైతన్య తో ప్రేమలో పడిన తర్వాత ఆమె హిందూ దేవుళ్లను కూడా పూజించడం ప్రారంభించింది.తన మతానికి మించి ఆమె హిందూ దేవుళ్లనే ఎక్కువగా నమ్మడం ప్రారంభించింది.ఇక అప్పటి నుండి ఆమె కోరుకున్నవన్నీ ‘లింగ భైరవి’ అమ్మవారి ఆశీర్వాదం వల్లే జరుగుతుందని బలంగా నమ్మడం ప్రారంభించింది.అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె లింగ భైరవి కి పరమ భక్తురాలు అయిపోయింది.

ఇదంతా చూసి సమంత క్రైస్తవ మతం నుండి హిందీ మతానికి పూర్తిగా మారిపోయిందా? అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.ఇక సమంత ఒక పక్క వెబ్ సిరీస్ లు చేస్తూ మరో పక్క సినిమాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గానే ఆమె యశోద సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన సత్తా చాటింది.ఇప్పుడు ఆమె విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ అనే చిత్రం, అలాగే బావు క్రేజీ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో అమెజాన్ ప్రైమ్ సంస్థ తెరకెక్కిస్తున్న ‘సీటా డెల్’ అనే చిత్రం లోను హీరోయిన్ గా నటిస్తుంది.